Saturday, July 2, 2016

English Gender wordsని తెలుగులో ఎందుకు త‌ప్పుగా వాడుతున్నాం?

చాలా ఇంగ్లీష్ ప‌దాలు తెలుగు వాడ‌కంలో ఇమిడిపోయాయి. అది ఎంత‌గా అంటే చ‌దువురానివారు కూడా వాటిని త‌మ వాడుక‌భాష‌లో ఉప‌యోగించేటంత‌. అయితే బాగా చ‌దువుకున్న‌వారు కూడా కొన్ని ప‌దాల వాడ‌కం విష‌యంలో త‌ప్పు చేస్తున్నారు. ఇప్పుడు మ‌నం Gender గురించి మాట్లాడుకుంటున్నాం కాబ‌ట్టి వీటి వాడకంలో చేసే కొన్ని త‌ప్పుల గురించి చూద్దాం.  

తెలుగులో వైద్యుడు, వైద్యురాలు అని వాడ‌తాం. వీటికి ఇంగ్లీషులో స‌రిపోయే ప‌దాలే ఉన్నాయి. అవి వైద్యుడు-Doctor, వైద్యురాలు-Doctress. కానీ మ‌నం ఇద్ద‌రినీ Doctor అనే సంబోధిస్తాం. మ‌రికొంత‌మంది మాత్రం వైద్యురాలికి ఇంగ్లీషు ప‌దం ముందు Lady చేర్చి Lady Doctor అని పిలుస్తున్నారు. 
మార్గ‌ద‌ర్శి, లేదా బ‌స్సులో టికెట్లు ఇచ్చే వ్య‌క్తి - Conductor, మార్గ‌ద‌ర్శిని, లేదా బ‌స్సులో టికెట్లు ఇచ్చే స్త్రీ - Conductress. కానీ మ‌నం మాత్రం ఇద్ద‌రినీ Conductor అనే సంబోధిస్తాం. అలాగే కండ‌క్ట‌ర్‌ను కూడా Lady చేర్చి Lady Conductor అని వాడుతున్నారు.           
వీటికి మ‌రిన్ని ఉదాహ‌ర‌ణాలు : 
కార్య‌నిర్వాహ‌కుడు - Manager, కార్య‌నిర్వాహ‌కురాలు - Manageress. మ‌నం మాత్రం ఇద్ద‌రినీ Manager అనే అంటాం. 
న‌గ‌ర అధ్య‌క్షుడు - Mayor, న‌గ‌ర అధ్య‌క్షురాలు - Mayoress. మ‌నం మాత్రం ఇద్ద‌రినీ Mayor అనే పిలుస్తాం.

ఇలాంటి ఉదాహ‌ర‌ణ‌లు ఎన్నో ఉన్నాయి. Masculine, Feminine genders list కోసం Noun పేజీలో చూడండి.  



Friday, July 1, 2016

మ‌న చంద‌మామ ఇంగ్లీషులో స్త్రీలింగం (Feminine Gender) ఎలా అయ్యాడు?

చంద్రుడిని(Moon) మ‌నం చంద‌మామ అంటాం. అంటే పురుషుడు
(Masculine Gender). కానీ ఇంగ్లీషులో చంద్రుడిని స్త్రీతో (Feminine Gender) పోలుస్తారు. దీనికి కార‌ణం అందం, మృదుత్వం, చ‌ల్ల‌ద‌నం. వీటికి పేరుగాంచిన ప్రాణ‌ములేని వ‌స్తువుల‌ను ప్రాణ‌మున్న వాటిగా భావించి స్త్రీలింగంగా పిలుస్తారు. అందుకే చ‌ల్ల‌ని వెన్నెలె కురిపించే అంద‌మైన చంద్రుడు, క‌వుల క‌లం నుంచి క‌విత‌లుగా జాలువారే మ‌న చంద‌మామ‌ను ఇంగ్లీషులో స్త్రీగా ప‌రిగ‌ణించారు. అంతేకాదు భూమి, ప్ర‌కృతి, రుతువులు, ఓడలు కూడా స్త్రీలింగ‌మే. 
Ex : The Moon has hidden her face behind a cloud. 
జాబిల‌మ్మ త‌న ముఖాన్ని మేఘం చాటున‌ దాచుకుంది.        
The ship lost all her boats in the storm.
తుఫాను దాటికి ఓడ తన ప‌డ‌వ‌ల‌న‌న్నింటినీ కోల్పోయింది.

ఇంగ్లీషులో సూర్యుడిని (Sun) పులింగంగా (Masculine Gender) ప‌రిగ‌ణిస్తారు. ఎందుకంటే బ‌లానికి, శ‌క్తికి ప్ర‌తీక‌లైన ప్రాణ‌ములేని వాటిని కూడా ప్రాణ‌మున్న‌వాటిగా భావిస్తారు. సూర్యుడు బ‌లానికి ప్ర‌తీక‌. త‌న వాడీ వేడీ కిర‌ణాల‌ను ప్ర‌ద‌ర్శించే శ‌క్తివంత‌మైన‌వాడు కాబ‌ట్టి పులింగంగా పిలుస్తారు. 
Ex : The Sun sheds his rays on rich and poor alike. 
సూర్యుడు త‌న కిర‌ణాల‌ను ధ‌నిక పేద అనే తేడాలేకుండా అందరిపై ప్ర‌స‌రింప‌జేస్తాడు.

శీతాకాలం (Winter), వేస‌వికాలం (Summer), స‌మ‌యం(Time) అనే వాటిని కూడా ఇంగ్లీషులో పులింగంగానే (Masculine Gender) ప‌రిగ‌ణిస్తారు.

Wednesday, June 22, 2016

The Noun Gender

సృష్టి కొన‌సాగాలంటే సంతానం వృద్ధి చెందాలి. పిల్ల‌ల పుట్టుక ఆగిపోయిందంటే జ‌నాభా త‌గ్గిపోతుంది. క్ర‌మంగా భూమిపై మ‌నుషులతోపాటు జీవ‌జాతులు అంత‌రించిపోతాయి. అందుకే సృష్టి కార్యాన్ని కొన‌సాగించేవి ఆడ‌, మ‌గ మాత్రమే. భూమిపై ఈ రెండే ప్ర‌ధాన జాతులు. వీటితోపాటు ఈ రెండింటిని క‌లిపి చెప్పేది ఒక‌వ‌ర్గం, ఈ రెండింటికీ చెంద‌నిది మ‌రో వ‌ర్గం కూడా ఉన్నాయి. వీటినే మ‌నం లింగ‌భేదంగా చెప్పుకుంటున్నాం. ఇంగ్లీషులో అయితే వీటిని Gender అంటాం. 


ఇవన్నీ నామ‌వాచ‌కాలే కాబ‌ట్టి వీటిని Noun Groupలో చేర్చారు. 
ఇంగ్లీషులో లింగ‌భేదాన్నిబ‌ట్టి ప్రాణుల‌ను నాలుగు ర‌కాలుగా విభ‌జించారు. అవి. 
1. Masculine Gender : పురుష జాతి లేదా పులింగ‌ము 
 A Noun that denotes a male animal is said to be of the Masculine Gender. 
2. Feminine Gender  : స్త్రీజాతి లేదా స్త్రీలింగ‌ము 
A Noun that denotes a female animal is said to be of the Feminine Gender. 
3. Common Gender : పురుష జాతికిగానీ, స్త్రీజాతికిగానీ చెందిన‌వి 
A Noun that denotes either a male or a female is said to be of the Common Gender. 
4. Neuter Gender : ఆడ‌, మ‌గ కానిది అంటే న‌పుంస‌క‌లింగం 
A Noun that denotes a thing that is neither male nor female is said to be of Neuter Gender.

Examples : 

1. Masculine Gender : 

Man : మ‌నిషి, పురుషుడు 
Boy  : బాలుడు
Hero : క‌థానాయ‌కుడు
Author : గ్రంథ‌క‌ర్త‌
Baron : భూస్వామి
Count : ప్ర‌భువు
Heir    : వార‌సుడు
Host   : గృహ‌స్థుడు             
 
2. Feminine Gender : 

Woman  : స్త్రీ
Girl  :      బాలిక 
Heroine  : క‌థానాయ‌కి
Authoress : గ్రంథ ర‌చ‌యిత్రి 
Baroness  : భూస్వామిని
Countess  : స్త్రీ ప్ర‌భువు
Heiress      : వార‌సురాలు 
Hostess     :  గృహ‌స్థురాలు    

3. Common Gender :

Child : పిల్ల లేక పిల్ల‌వాడు 
Friend : స్నేహితుడు లేక స్నేహితురాలు   
Parent : త‌ల్లి లేక తండ్రి 
Student : విద్యార్థి లేక విద్యార్థిని
Teacher : ఉపాధ్యాయుడు లేక ఉపాధ్యాయురాలు
Thief : దొంగ లేక దొంగ‌ది 
Enemy : మ‌గ శ‌త్రువు లేక ఆడ శ‌త్రువు 
Doctor : వైద్యుడు లేక వైద్యురాలు 
        
4. Neuter Gender :

Book : పుస్త‌క‌ము
Pen : క‌ల‌ము
Ball : బంతి
Bat : బ్యాట్ 
Vehicle : వాహ‌న‌ము 
స్త్రీలింగ‌ము, పులింగ‌ముల‌కు చెంద‌నివి, ప్రాణ‌ములేని వ‌స్తువులు ఇందులోకి వ‌స్తాయి. స్త్రీ, పురుష భేద‌ము తెలియ‌ని చెట్టు, చేప‌, చీమ వంటి ప్రాణులు కూడా Neuter Genderలోకే వస్తాయి.

Saturday, May 7, 2016

Countable Nouns and Uncountable Nouns అంటే ఏంటి?

ప్ర‌పంచంలోని వ‌స్తువుల‌ను రెండు ర‌కాలుగా విభ‌జించ‌వ‌చ్చు. ఒక‌టి లెక్కించ‌ద‌గిన‌వి, రెండు లెక్కించ‌లేనివి. దీని ఆధారంగానే నామ‌వాచ‌కాల‌ను కూడా Countable Nouns లేదా Countables (లెక్కించ‌ద‌గిన‌వి), Uncountable Nouns  లేదా Uncountables (లెక్కించ‌లేనివి) అని విభ‌జించారు. 

Ex : మ‌నుషుల‌ను(men) ఒక‌రు, ఇద్ద‌రు, ముగ్గురు ఇలా లెక్కిస్తాం. జంతువులు (Animals), ప‌క్షులు (Birds), చెట్లు(Trees), మొక్క‌ల‌ను(Plants) కూడా ఒక‌టి, రెండు అని లెక్కించొచ్చు. ఒక బ్యాగు (one bag), రెండు క‌ప్పులు (two cups), మూడు పెన్నులు (three pens) ఇలా వ‌స్తువుల‌ను కూడా లెక్క‌పెడ‌తాం. కానీ ఒక పాలు(milk), ఒక నీరు (water), ఒక బంగారం(gold) అని అన‌లేం. ఎందుకంటే వీటిని లెక్కించ‌డం సాధ్యం కాదు. పాలు, నీళ్ల‌ను లీట‌ర్ల‌లో కొలుస్తాం. బంగారం, వెండిని(silver) గ్రాములు, కిలోల్లో తూకం వేస్తాం. చ‌క్కెర‌ (sugar), బియ్యం (rice), ప‌ప్పుల‌ను(grams) కిలోల్లో బ‌రువును తూకం వేస్తాంగానీ వాటిని లెక్కించ‌డం సాధ్యం కాదు. నేల‌పై ప‌రుచుకున్న బండ‌రాళ్లు (stone), ఇసుక (sand) ఇలాంటివాటిని లెక్కించ‌లేం. 

Countable Nouns లేదా Countables : Ex : man, animal, bird, tree, plant, bag, cup, pen, river, mountain....etc... 

Uncountable Nouns  లేదా Uncountables : Ex : milk, water, gold, silver, sugar, rice, air, rain, glass, wool, stone, sand....etc...

Uncountablesని కూడా కొన్నిసార్లు Countablesగా వాడ‌తాం. ఉదాహ‌ర‌ణ‌కు waterను లెక్క‌పెట్ట‌లేం, కానీ water drops (నీటి బిందువుల‌ను) లెక్క‌పెట్ట‌గ‌లం. ప‌రుచుకుని ఉన్న బండ‌రాళ్ల‌ను లెక్క‌పెట్టలేం. కానీ విడిగా ఉన్న రాళ్ల‌ను లెక్క‌పెట్ట‌గ‌లం. ఉదాహ‌ర‌ణ‌కు ఆ బాలుడు కోతిపైకి రెండు రాళ్లు విసిరాడు.

Saturday, April 16, 2016

English Grammar Lesson 7 Preposition, Conjunction, Interjection

Prepositionను ఎలా ఉప‌యోగించాలి?






Friday, April 1, 2016

Nouns ఎన్ని ర‌కాలు ?

Kinds of Nouns : నామ‌వాచ‌కం ర‌కాలు


Noun : నామ‌వాచ‌కాన్ని సుల‌భంగా అర్థం చేసుకొని ఉప‌యోగించ‌డానికి వీలుగా ఐదు ర‌కాలుగా విభ‌జించారు. అవేంటో తెలుసుకోవ‌డం వ‌ల్ల స‌రిగా వాడొచ్చు. అందుకే వీటిపై ప్రైమ‌రీ స్కూల్ నుంచే పిల్ల‌ల‌కు నేర్పిస్తున్నారు. కొన్ని ప‌దాల‌ను ఇచ్చి అవి ఏ ర‌క‌మైన నామావాచ‌కాలో విభ‌జించాల్సిందిగా పిల్ల‌ల‌కు హోం వ‌ర్క్ కూడా ఇస్తున్నారు. పైక్లాసుకు వెళ్లేకొద్దీ విద్యార్థులు వీటిపై (Nouns) ప‌ట్టుసాధిస్తారు. త‌ప్పులు దొర్ల‌కుండా ఉప‌యోగిస్తారు. నామ‌వాచ‌కాల గురించి స‌రిగా తెలిస్తేనే వాటికి బ‌దులు ఎలాంటి స‌ర్వ‌నామాలు (Pronouns) ఉప‌యోగించాలి, వాటితో ఎలాంటి క్రియ‌ల‌ను (Verbs) వాడాలో కూడా అర్థ‌మ‌వుతుంది. 



Nouns are of five Kinds : నామ‌వాచ‌కాలు ఐదు ర‌కాలు 


1. Proper Nouns   2. Common Nouns  3. Material Nouns  4.Collective Nouns   5. Abstract Nouns


1.Proper Noun : 


A Proper Noun is the name of some particular person, place or thing. వ్య‌క్తి పేరు, ప్ర‌దేశ‌ము పేరు లేదా వ‌స్తువు పేరును సూచించేది Proper Noun. ఒక వ్య‌క్తిని మ‌నం ఎలా గుర్తుంచుకుంటాం. పేరుతోనే క‌దా! ఒక ప్ర‌దేశాన్ని కూడా పేరుతోనే గుర్తుప‌డ‌తాం. వ‌స్తువుల‌ను కూడా వాటి పేర్ల‌తోనే గుర్తుపెట్టుకుంటాం. 
Proper అంటే ఒక‌రి సొంతం. Propern Nounను ఎప్పుడూ capital letter (పెద్ద అక్ష‌రం)తో మొద‌లుపెట్టాలి. వాక్యం మ‌ధ్య‌లో వ‌చ్చినా స‌రే. 
Ex : Krishna is a good boy. 
       Radha is a good girl.  
ఇక్క‌డ కృష్ణా అనేది బాలుడి పేరు. రాధా అనేది బాలిక పేరు. ఈ రెండు కూడా ప్ర‌త్యేక‌మైన పేర్లు కాబ‌ట్టి Proper Nouns. 
      Hyderabad is the best city. 
ఇక్క‌డ హైద‌రాబాద్ అనేది Proper Noun. 


2. Common Noun : 


A Common Noun is a name given in common to every person or thing. సాధార‌ణంగా క‌లిపి పిలిచే ప‌దాల‌ను అంటే ఎక్కువ మందికి లేదా వ‌స్తువుల‌కు వ‌ర్తించే ప‌దాల‌ను Common Nouns అంటాం.
Ex : Krishna is a good boy. ఇందులో boy అనేది Common Noun. ఎందుకంటే Krishna అనేది ప్ర‌త్యేక‌మైన పేరు అంటే ప్రాప‌ర్ నౌన్. కానీ   boy అనేది ఏ మ‌గ పిల్లాడికైనా వ‌ర్తిస్తుంది. అందుకే ఇది Common Noun.
       Radha is a good girl. ఇందులో girl అనేది Common Noun. ఎందుకంటే Radha అనేది ప్ర‌త్యేక‌మైన 
పేరు అంటే ప్రాప‌ర్ నౌన్. కానీ girl అనేది ఏ ఆడ పిల్ల‌కైనా వ‌ర్తిస్తుంది. అందుకే ఇది Common Noun. 
     Hyderabad is the best city. ఇందులో city అనేది Common Noun. ఎందుకంటే Hyderabad అనేది ప్ర‌త్యేక‌మైన పేరు అంటే ప్రాప‌ర్ నౌన్. కానీ city అనేది ఏ నగ‌రానికైనా వాడొచ్చు. అందుకే ఇది Common Noun.
మ‌రికొన్ని ఉదాహ‌ర‌ణ‌లు : Man, woman, friend, student, town, village, river, vehicle, animal, tree, bird, insect... 


3. Material Noun : 


Material Noun is the name of a material or substance. విడివిడిగా కాకుండా లెక్కించ‌డానికి వీలులేకుండా ఉండే ప‌దార్థాలు, వ‌స్తువుల పేర్లే మెటీరియ‌ల్ నౌన్స్. అంటే కుప్ప‌గాగాని, ముద్ద‌గాగాని, ద్ర‌వ‌రూపంలోగాని, ఘ‌న‌రూపంలోగాని ఉన్న వ‌స్తువులు, ప‌దార్థాల పేర్లు. ఉదా : Rice (బియ్యం, అన్నం), Sand (ఇసుక), Wool (ఉన్ని), Iron (ఇనుము), Oil (నూనె), Water (నీరు), Milk (పాలు), Ice (మంచుగ‌డ్డ‌), Rock (బండ‌రాయి) మొద‌లైన‌వి...


4. Collective Noun : 


A Collective Noun is the name of a number or collection of persons or things taken together and spoken of as one whole. మ‌నుషులు, వ‌స్తువులు లేదా జంతువుల స‌మూహాల‌ను తెలిపేదే క‌లెక్టివ్ నౌన్. Ex : Crowd (జ‌న స‌మూహం), Mob (అల్ల‌రిమూక‌), Fleet (ఓడ‌ల గుంపు), Herd (ప‌శువుల మంద‌), Army (సైన్యం) Bunch (గుత్తి) మొద‌లైన‌వి...


5.Abstract Noun : 


An Abstract Noun is usually the name of a quality, action or state. గుణ‌ముల పేర్లు, స్థితుల పేర్లు, శాస్త్ర‌ములు లేక క‌ళ‌ల పేర్ల‌ను అబ్ స్ట్రాక్ట్ నౌన్ అంటాం. అంటే వేటినైతే మ‌నం ముట్టుకోలేమో, చూడ‌లేమో అలాంటివ‌న్నీఅబ్‌స్ట్రాక్ట్ నౌన్సే. వీటిలో చాలా వ‌ర‌కు మ‌న భావ‌న‌లే. అంటే వీటిని మ‌నం ఫీల‌వుతాం (ఆస్వాదిస్తాం) కానీ చూడ‌లేం. 
Ex : 
1. Qualities (గుణ‌ములు) : 
kindness (ద‌య‌ ), hardness (క‌ఠిన‌త్వ‌ము), goodness (మంచిత‌న‌ము), honesty (నిజాయితీ), bravery (సాహ‌స‌ము), strength (బ‌ల‌ము), wisdom (తెలివి, విజ్ఙానం), darkness (చీక‌టి), brightness (వెలుతురు)   
freedom (స్వేచ్ఛ‌) 

2. Action (ప‌ని) : 
theft (దొంగ‌త‌న‌ము), movement (క‌ద‌లిక‌), laughter (న‌వ్వు), judgement (తీర్పు), hatred (అస‌హ్యించుకోవ‌డం)

3.State (స్థితి) : 
childhood (శైశ‌వ‌ము), boyhood (బాల్య‌ము), youth (య‌వ్వ‌న‌ము), slavery (బానిస‌త్వ‌ము), sleep (నిద్ర‌ ), sickness (అనారోగ్యం), death (మ‌ర‌ణం)  

Sunday, March 20, 2016

టెన్త్ ఇంగ్లీష్ గ్రామ‌ర్ టిప్స్

టెన్త్ ఇంగ్లీష్ ఎగ్జామ్‌లో విద్యార్థులు ఎక్కువ‌గా తిక‌మ‌క ప‌డేది Persons and Verbs గురించి. జాగ్రత్త‌గా గుర్తుపెట్టుకుంటే ఈజీగా రాయొచ్చు. 

Persons : 1st person, 2nd person, 3rd person అని మూడు ర‌కాలు. 
1st person అంటే మాట్లాడే వ్య‌క్తి. ఉదాహ‌ర‌ణ‌కు నేను మీతో మాట్లాడుతున్నాను. అంటే  I నేను, 1st personని. Iతో present tenseలో am అనే special verbను వాడుతాం. Plural (బ‌హువ‌చ‌నం)లో We అంటే మేము లేదా మ‌నం. Weతో are అనే special verbను వాడుతాం. Past tenseలో Iతో wasను, Weతో wereని వాడుతాం.
2nd person అంటే ఎవ‌రితో మాట్లాడుతున్నామో ఆ వ్య‌క్తి లేదా వ్య‌క్తులు. నేను మాట్లాడుతుంటే నీవు వింటున్నావు. ఎక్కువ మంది ఉంటే మీరు వింటున్నారు. అంటే నేను 1st personని. నీవు లేదా మీరు అంటే ఇంగ్లీషులో you అనేది 2nd person. Youతో present tenseలో areని, past tenseలో wereని వాడుతాం.
3rd person : 1st person, 2nd person ఎవ‌రి గురించ‌యితే మాట్లాడుకుంటారో ఆ వ్య‌క్తిని 3rd person అంటాం. ఇద్ద‌రూ క‌లిసి కేవ‌లం ఆడ‌, మ‌గ వ్య‌క్తుల గురించే మాట్లాడుకోరు. వ‌స్తువులు, ప్ర‌దేశాలు, జంతువుల గురించి కూడా మాట్లాడుకుంటారు. అంటే ఇవ‌న్నీ 3rd personనే. అత‌డిని ఇంగ్లీషులో He అని, ఆమెను She అని, వ‌స్తువులు, ప్ర‌దేశాల‌ను It అంటాం. ఈ మూడింటితోనూ present tenseలో isని, past tenseలో wasని వాడుతాం. ఇక వీట‌న్నింటికి plural (బ‌హువ‌చ‌నం)లో present tenseలో areని past tenseలో wereని ఉప‌యోగిస్తాం. 

Friday, March 11, 2016

English Grammar Lesson 6 Verb and Adverb

విశేష‌ణానికి, క్రియావిశేష‌ణానికి తేడా ఏంటి?




Friday, March 4, 2016

Tenth exam tension - Tips

పరీక్షలంటే అదో టెన్షన్. పదో తరగతి పరీక్షలు వచ్చేస్తున్నాయి. విద్యార్థులు ముఖ్యంగా ఇంగ్లీష్ అంటే చాలా టెన్షన్ పడతారు. అనవసరంగా టెన్షన్ పడొద్దు. కొన్ని టిప్స్ పాటిస్తే ఎలాంటి సమస్య ఉండదు.  


  • సిలబస్ రివిజన్ చేసే టైంలో సందేహాలుంటే టీచర్లను అడిగి తెలుసుకోవాలి. 
  • ఎగ్జాం అయ్యే వరకు ఎలక్ఠ్రానిక్ గాడ్జెట్స్ కి దూరంగా ఉండండి. ఎందుకంటే అవి మీ ఏకాగ్రతకు భంగం కలిగిస్తాయి.
  • ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంటే చాలా కష్టం అనే నెగెటివ్ ఫీలింగ్ చాలా మందిలో ఉంది. అది కరెక్ట్ కాదు. ఇతరులు వాళ్ల అభిప్రాయాన్ని మీపై రుద్దే ప్రయత్నం చేస్తారు. అలాంటివి నమ్మకండి.
  • నేను పరీక్షలు బాగా రాయగలను అని పాజిటివ్ గా ఆలోచించండి. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. చదివింది గుర్తుకు ఉంటుంది. టెన్షన్ పడితే చదివింది మరిచిపోయే ప్రమాదం ఉంది.  
  • పాత ప్రశ్నాపత్రాలను పరిశీలించి ప్రశ్నల సరళిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కాని అవే ప్రశ్నలపై ఆధారపడొద్దు. 
  • మోడల్ పేపర్స్ తయారు చేసుకుని సాల్వ్ చేస్తే లోపాలను సరిచేసుకునేందుకు వీలవుతుంది.
  • బట్టీపట్టడం వల్ల ప్రశ్న తిప్పి ఇస్తే టెన్షన్ పడతారు. అర్థం చేసుకుని చదవితే ప్రశ్న ఎలా ఇచ్చినా ఆన్సర్ రాయగలుగుతారు.
  • పరీక్షలకు ముందు తగినంత రెస్ట్ ఉండేలా చూసుకోండి.
  • మంచి ఆహారం తీసుకోండి. 
  • మెదడు చురుగ్గా పనిచేయడానికి మంచి అహారం, తగినంత విశ్రాంతి అవసరం అని గుర్తుంచుకోండి.

Monday, February 8, 2016

English Grammar Lesson 5 Noun, Pronoun, Adjective

విశేషణం ఎప్పుడు వాడాలి? ఎలా ఉపయోగించాలి ?





English Grammar Lesson 4 Parts of Speech 1


తెలుగు, ఇంగ్లీషు Parts of Speechలలో తేడా ఉందా? 


English Grammar Lesson 3 Subject and Predicate

 పోటీ పరీక్షల్లో Subject ఆవశ్యకత ఏంటి? 

ENGLISH GRAMMAR LESSON 2 WORD, PHRASE AND SENTENCE

ఒక పదంతో వాక్యం తయారవుతుందా?

Sunday, February 7, 2016

ENGLISH GRAMMAR LESSON 1 BASICS, ALPHABETS, VOWELS AND CONSONANTS

హీరో కావాలంటే జీరో నుంచి మొదలు పెట్టాలా? 

ఇంగ్లీష్ వ్యాకరణం నేర్చుకోవడం అంత కష్టం కాదు. బేసిక్స్ నుంచి మొదలు పెడితే చాలా సులభం. ఇలా జీరో నుంచి మొదలుపెట్టి హీరో అయినవాళ్లు చాలా మందే ఉన్నారు. మరి మనం ఆ ప్రయత్నం ఎందుకు చేయకూడదు.

Saturday, February 6, 2016

మిత్రులకు స్వాగతం!

ఉద్యోగం కావాలంటే పోటీ పరీక్ష రాయాలి. పరీక్షలో మంచి మార్కులు పొందాలంటే ఇంగ్లీష్ రావాలి. ఇంటర్వ్యూకు సెలక్ట్ కావాలంటే ఇంగ్లీషులో మాట్లాడగలగాలి. వ్యాపారంలో రాణించాలంటే ఆంగ్లంతో పరిచయముండాలి. విజయవానికి పరాజయానికి మధ్య అడ్డుగోడ ఇంగ్లీష్. లాభానికి నష్టానికి మధ్య విభజనరేఖ ఆంగ్లం. ఇదిప్పుడు అంతర్జాతీయ సమస్యగా మారింది. తెలుగు, హిందీ మాత్రమే తెలిస్తే సరిపోదు. ఇంగ్లీషు భాష రావాలి. కానీ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు బోధన అంతంత మాత్రమే. అదేమంటే ఉపాధ్యాయుల కొరత అంటారు. ఎన్నేళ్లయినా ఇది తీరని సమస్య. మరి దీనికి పరిష్కారం? స్వతహాగా ఆంగ్లం నేర్చుకోవడమే. అదేమంత కష్టం కాదు. జీరో నుంచి మొదలు పెడితే హీరో అవుతారు. ఇంగ్లీష్ టింగ్లీష్ ఉద్దేశం కూడా అదే.