పరీక్షలంటే అదో టెన్షన్. పదో తరగతి పరీక్షలు వచ్చేస్తున్నాయి. విద్యార్థులు ముఖ్యంగా ఇంగ్లీష్ అంటే చాలా టెన్షన్ పడతారు. అనవసరంగా టెన్షన్ పడొద్దు. కొన్ని టిప్స్ పాటిస్తే ఎలాంటి సమస్య ఉండదు.
- సిలబస్ రివిజన్ చేసే టైంలో సందేహాలుంటే టీచర్లను అడిగి తెలుసుకోవాలి.
- ఎగ్జాం అయ్యే వరకు ఎలక్ఠ్రానిక్ గాడ్జెట్స్ కి దూరంగా ఉండండి. ఎందుకంటే అవి మీ ఏకాగ్రతకు భంగం కలిగిస్తాయి.
- ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంటే చాలా కష్టం అనే నెగెటివ్ ఫీలింగ్ చాలా మందిలో ఉంది. అది కరెక్ట్ కాదు. ఇతరులు వాళ్ల అభిప్రాయాన్ని మీపై రుద్దే ప్రయత్నం చేస్తారు. అలాంటివి నమ్మకండి.
- నేను పరీక్షలు బాగా రాయగలను అని పాజిటివ్ గా ఆలోచించండి. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. చదివింది గుర్తుకు ఉంటుంది. టెన్షన్ పడితే చదివింది మరిచిపోయే ప్రమాదం ఉంది.
- పాత ప్రశ్నాపత్రాలను పరిశీలించి ప్రశ్నల సరళిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కాని అవే ప్రశ్నలపై ఆధారపడొద్దు.
- మోడల్ పేపర్స్ తయారు చేసుకుని సాల్వ్ చేస్తే లోపాలను సరిచేసుకునేందుకు వీలవుతుంది.
- బట్టీపట్టడం వల్ల ప్రశ్న తిప్పి ఇస్తే టెన్షన్ పడతారు. అర్థం చేసుకుని చదవితే ప్రశ్న ఎలా ఇచ్చినా ఆన్సర్ రాయగలుగుతారు.
- పరీక్షలకు ముందు తగినంత రెస్ట్ ఉండేలా చూసుకోండి.
- మంచి ఆహారం తీసుకోండి.
- మెదడు చురుగ్గా పనిచేయడానికి మంచి అహారం, తగినంత విశ్రాంతి అవసరం అని గుర్తుంచుకోండి.
0 comments:
Post a Comment