Friday, April 1, 2016

Nouns ఎన్ని ర‌కాలు ?

Kinds of Nouns : నామ‌వాచ‌కం ర‌కాలు


Noun : నామ‌వాచ‌కాన్ని సుల‌భంగా అర్థం చేసుకొని ఉప‌యోగించ‌డానికి వీలుగా ఐదు ర‌కాలుగా విభ‌జించారు. అవేంటో తెలుసుకోవ‌డం వ‌ల్ల స‌రిగా వాడొచ్చు. అందుకే వీటిపై ప్రైమ‌రీ స్కూల్ నుంచే పిల్ల‌ల‌కు నేర్పిస్తున్నారు. కొన్ని ప‌దాల‌ను ఇచ్చి అవి ఏ ర‌క‌మైన నామావాచ‌కాలో విభ‌జించాల్సిందిగా పిల్ల‌ల‌కు హోం వ‌ర్క్ కూడా ఇస్తున్నారు. పైక్లాసుకు వెళ్లేకొద్దీ విద్యార్థులు వీటిపై (Nouns) ప‌ట్టుసాధిస్తారు. త‌ప్పులు దొర్ల‌కుండా ఉప‌యోగిస్తారు. నామ‌వాచ‌కాల గురించి స‌రిగా తెలిస్తేనే వాటికి బ‌దులు ఎలాంటి స‌ర్వ‌నామాలు (Pronouns) ఉప‌యోగించాలి, వాటితో ఎలాంటి క్రియ‌ల‌ను (Verbs) వాడాలో కూడా అర్థ‌మ‌వుతుంది. 



Nouns are of five Kinds : నామ‌వాచ‌కాలు ఐదు ర‌కాలు 


1. Proper Nouns   2. Common Nouns  3. Material Nouns  4.Collective Nouns   5. Abstract Nouns


1.Proper Noun : 


A Proper Noun is the name of some particular person, place or thing. వ్య‌క్తి పేరు, ప్ర‌దేశ‌ము పేరు లేదా వ‌స్తువు పేరును సూచించేది Proper Noun. ఒక వ్య‌క్తిని మ‌నం ఎలా గుర్తుంచుకుంటాం. పేరుతోనే క‌దా! ఒక ప్ర‌దేశాన్ని కూడా పేరుతోనే గుర్తుప‌డ‌తాం. వ‌స్తువుల‌ను కూడా వాటి పేర్ల‌తోనే గుర్తుపెట్టుకుంటాం. 
Proper అంటే ఒక‌రి సొంతం. Propern Nounను ఎప్పుడూ capital letter (పెద్ద అక్ష‌రం)తో మొద‌లుపెట్టాలి. వాక్యం మ‌ధ్య‌లో వ‌చ్చినా స‌రే. 
Ex : Krishna is a good boy. 
       Radha is a good girl.  
ఇక్క‌డ కృష్ణా అనేది బాలుడి పేరు. రాధా అనేది బాలిక పేరు. ఈ రెండు కూడా ప్ర‌త్యేక‌మైన పేర్లు కాబ‌ట్టి Proper Nouns. 
      Hyderabad is the best city. 
ఇక్క‌డ హైద‌రాబాద్ అనేది Proper Noun. 


2. Common Noun : 


A Common Noun is a name given in common to every person or thing. సాధార‌ణంగా క‌లిపి పిలిచే ప‌దాల‌ను అంటే ఎక్కువ మందికి లేదా వ‌స్తువుల‌కు వ‌ర్తించే ప‌దాల‌ను Common Nouns అంటాం.
Ex : Krishna is a good boy. ఇందులో boy అనేది Common Noun. ఎందుకంటే Krishna అనేది ప్ర‌త్యేక‌మైన పేరు అంటే ప్రాప‌ర్ నౌన్. కానీ   boy అనేది ఏ మ‌గ పిల్లాడికైనా వ‌ర్తిస్తుంది. అందుకే ఇది Common Noun.
       Radha is a good girl. ఇందులో girl అనేది Common Noun. ఎందుకంటే Radha అనేది ప్ర‌త్యేక‌మైన 
పేరు అంటే ప్రాప‌ర్ నౌన్. కానీ girl అనేది ఏ ఆడ పిల్ల‌కైనా వ‌ర్తిస్తుంది. అందుకే ఇది Common Noun. 
     Hyderabad is the best city. ఇందులో city అనేది Common Noun. ఎందుకంటే Hyderabad అనేది ప్ర‌త్యేక‌మైన పేరు అంటే ప్రాప‌ర్ నౌన్. కానీ city అనేది ఏ నగ‌రానికైనా వాడొచ్చు. అందుకే ఇది Common Noun.
మ‌రికొన్ని ఉదాహ‌ర‌ణ‌లు : Man, woman, friend, student, town, village, river, vehicle, animal, tree, bird, insect... 


3. Material Noun : 


Material Noun is the name of a material or substance. విడివిడిగా కాకుండా లెక్కించ‌డానికి వీలులేకుండా ఉండే ప‌దార్థాలు, వ‌స్తువుల పేర్లే మెటీరియ‌ల్ నౌన్స్. అంటే కుప్ప‌గాగాని, ముద్ద‌గాగాని, ద్ర‌వ‌రూపంలోగాని, ఘ‌న‌రూపంలోగాని ఉన్న వ‌స్తువులు, ప‌దార్థాల పేర్లు. ఉదా : Rice (బియ్యం, అన్నం), Sand (ఇసుక), Wool (ఉన్ని), Iron (ఇనుము), Oil (నూనె), Water (నీరు), Milk (పాలు), Ice (మంచుగ‌డ్డ‌), Rock (బండ‌రాయి) మొద‌లైన‌వి...


4. Collective Noun : 


A Collective Noun is the name of a number or collection of persons or things taken together and spoken of as one whole. మ‌నుషులు, వ‌స్తువులు లేదా జంతువుల స‌మూహాల‌ను తెలిపేదే క‌లెక్టివ్ నౌన్. Ex : Crowd (జ‌న స‌మూహం), Mob (అల్ల‌రిమూక‌), Fleet (ఓడ‌ల గుంపు), Herd (ప‌శువుల మంద‌), Army (సైన్యం) Bunch (గుత్తి) మొద‌లైన‌వి...


5.Abstract Noun : 


An Abstract Noun is usually the name of a quality, action or state. గుణ‌ముల పేర్లు, స్థితుల పేర్లు, శాస్త్ర‌ములు లేక క‌ళ‌ల పేర్ల‌ను అబ్ స్ట్రాక్ట్ నౌన్ అంటాం. అంటే వేటినైతే మ‌నం ముట్టుకోలేమో, చూడ‌లేమో అలాంటివ‌న్నీఅబ్‌స్ట్రాక్ట్ నౌన్సే. వీటిలో చాలా వ‌ర‌కు మ‌న భావ‌న‌లే. అంటే వీటిని మ‌నం ఫీల‌వుతాం (ఆస్వాదిస్తాం) కానీ చూడ‌లేం. 
Ex : 
1. Qualities (గుణ‌ములు) : 
kindness (ద‌య‌ ), hardness (క‌ఠిన‌త్వ‌ము), goodness (మంచిత‌న‌ము), honesty (నిజాయితీ), bravery (సాహ‌స‌ము), strength (బ‌ల‌ము), wisdom (తెలివి, విజ్ఙానం), darkness (చీక‌టి), brightness (వెలుతురు)   
freedom (స్వేచ్ఛ‌) 

2. Action (ప‌ని) : 
theft (దొంగ‌త‌న‌ము), movement (క‌ద‌లిక‌), laughter (న‌వ్వు), judgement (తీర్పు), hatred (అస‌హ్యించుకోవ‌డం)

3.State (స్థితి) : 
childhood (శైశ‌వ‌ము), boyhood (బాల్య‌ము), youth (య‌వ్వ‌న‌ము), slavery (బానిస‌త్వ‌ము), sleep (నిద్ర‌ ), sickness (అనారోగ్యం), death (మ‌ర‌ణం)  

0 comments:

Post a Comment