Saturday, May 7, 2016

Countable Nouns and Uncountable Nouns అంటే ఏంటి?

ప్ర‌పంచంలోని వ‌స్తువుల‌ను రెండు ర‌కాలుగా విభ‌జించ‌వ‌చ్చు. ఒక‌టి లెక్కించ‌ద‌గిన‌వి, రెండు లెక్కించ‌లేనివి. దీని ఆధారంగానే నామ‌వాచ‌కాల‌ను కూడా Countable Nouns లేదా Countables (లెక్కించ‌ద‌గిన‌వి), Uncountable Nouns  లేదా Uncountables (లెక్కించ‌లేనివి) అని విభ‌జించారు. 

Ex : మ‌నుషుల‌ను(men) ఒక‌రు, ఇద్ద‌రు, ముగ్గురు ఇలా లెక్కిస్తాం. జంతువులు (Animals), ప‌క్షులు (Birds), చెట్లు(Trees), మొక్క‌ల‌ను(Plants) కూడా ఒక‌టి, రెండు అని లెక్కించొచ్చు. ఒక బ్యాగు (one bag), రెండు క‌ప్పులు (two cups), మూడు పెన్నులు (three pens) ఇలా వ‌స్తువుల‌ను కూడా లెక్క‌పెడ‌తాం. కానీ ఒక పాలు(milk), ఒక నీరు (water), ఒక బంగారం(gold) అని అన‌లేం. ఎందుకంటే వీటిని లెక్కించ‌డం సాధ్యం కాదు. పాలు, నీళ్ల‌ను లీట‌ర్ల‌లో కొలుస్తాం. బంగారం, వెండిని(silver) గ్రాములు, కిలోల్లో తూకం వేస్తాం. చ‌క్కెర‌ (sugar), బియ్యం (rice), ప‌ప్పుల‌ను(grams) కిలోల్లో బ‌రువును తూకం వేస్తాంగానీ వాటిని లెక్కించ‌డం సాధ్యం కాదు. నేల‌పై ప‌రుచుకున్న బండ‌రాళ్లు (stone), ఇసుక (sand) ఇలాంటివాటిని లెక్కించ‌లేం. 

Countable Nouns లేదా Countables : Ex : man, animal, bird, tree, plant, bag, cup, pen, river, mountain....etc... 

Uncountable Nouns  లేదా Uncountables : Ex : milk, water, gold, silver, sugar, rice, air, rain, glass, wool, stone, sand....etc...

Uncountablesని కూడా కొన్నిసార్లు Countablesగా వాడ‌తాం. ఉదాహ‌ర‌ణ‌కు waterను లెక్క‌పెట్ట‌లేం, కానీ water drops (నీటి బిందువుల‌ను) లెక్క‌పెట్ట‌గ‌లం. ప‌రుచుకుని ఉన్న బండ‌రాళ్ల‌ను లెక్క‌పెట్టలేం. కానీ విడిగా ఉన్న రాళ్ల‌ను లెక్క‌పెట్ట‌గ‌లం. ఉదాహ‌ర‌ణ‌కు ఆ బాలుడు కోతిపైకి రెండు రాళ్లు విసిరాడు.