సృష్టి కొనసాగాలంటే సంతానం వృద్ధి చెందాలి. పిల్లల పుట్టుక ఆగిపోయిందంటే జనాభా తగ్గిపోతుంది. క్రమంగా భూమిపై మనుషులతోపాటు జీవజాతులు అంతరించిపోతాయి. అందుకే సృష్టి కార్యాన్ని కొనసాగించేవి ఆడ, మగ మాత్రమే. భూమిపై ఈ రెండే ప్రధాన జాతులు. వీటితోపాటు ఈ రెండింటిని కలిపి చెప్పేది ఒకవర్గం, ఈ రెండింటికీ చెందనిది మరో వర్గం కూడా ఉన్నాయి. వీటినే మనం లింగభేదంగా చెప్పుకుంటున్నాం. ఇంగ్లీషులో అయితే వీటిని Gender అంటాం.
ఇవన్నీ నామవాచకాలే కాబట్టి వీటిని Noun Groupలో చేర్చారు.
ఇంగ్లీషులో లింగభేదాన్నిబట్టి ప్రాణులను నాలుగు రకాలుగా విభజించారు. అవి.
1. Masculine Gender : పురుష జాతి లేదా పులింగము
A Noun that denotes a male animal is said to be of the Masculine Gender.
2. Feminine Gender : స్త్రీజాతి లేదా స్త్రీలింగము
A Noun that denotes a female animal is said to be of the Feminine Gender.
3. Common Gender : పురుష జాతికిగానీ, స్త్రీజాతికిగానీ చెందినవి
A Noun that denotes either a male or a female is said to be of the Common Gender.
4. Neuter Gender : ఆడ, మగ కానిది అంటే నపుంసకలింగం
A Noun that denotes a thing that is neither male nor female is said to be of Neuter Gender.
Examples :
1. Masculine Gender :
Man : మనిషి, పురుషుడు
Boy : బాలుడు
Hero : కథానాయకుడు
Author : గ్రంథకర్త
Baron : భూస్వామి
Count : ప్రభువు
Heir : వారసుడు
Host : గృహస్థుడు
2. Feminine Gender :
Woman : స్త్రీ
Girl : బాలిక
Heroine : కథానాయకి
Authoress : గ్రంథ రచయిత్రి
Baroness : భూస్వామిని
Countess : స్త్రీ ప్రభువు
Heiress : వారసురాలు
Hostess : గృహస్థురాలు
3. Common Gender :
Child : పిల్ల లేక పిల్లవాడు
Friend : స్నేహితుడు లేక స్నేహితురాలు
Parent : తల్లి లేక తండ్రి
Student : విద్యార్థి లేక విద్యార్థిని
Teacher : ఉపాధ్యాయుడు లేక ఉపాధ్యాయురాలు
Thief : దొంగ లేక దొంగది
Enemy : మగ శత్రువు లేక ఆడ శత్రువు
Doctor : వైద్యుడు లేక వైద్యురాలు
4. Neuter Gender :
Book : పుస్తకము
Pen : కలము
Ball : బంతి
Bat : బ్యాట్
Vehicle : వాహనము
స్త్రీలింగము, పులింగములకు చెందనివి, ప్రాణములేని వస్తువులు ఇందులోకి వస్తాయి. స్త్రీ, పురుష భేదము తెలియని చెట్టు, చేప, చీమ వంటి ప్రాణులు కూడా Neuter Genderలోకే వస్తాయి.
0 comments:
Post a Comment