చంద్రుడిని(Moon) మనం చందమామ అంటాం. అంటే పురుషుడు
(Masculine Gender). కానీ ఇంగ్లీషులో చంద్రుడిని స్త్రీతో (Feminine Gender) పోలుస్తారు. దీనికి కారణం అందం, మృదుత్వం, చల్లదనం. వీటికి పేరుగాంచిన ప్రాణములేని వస్తువులను ప్రాణమున్న వాటిగా భావించి స్త్రీలింగంగా పిలుస్తారు. అందుకే చల్లని వెన్నెలె కురిపించే అందమైన చంద్రుడు, కవుల కలం నుంచి కవితలుగా జాలువారే మన చందమామను ఇంగ్లీషులో స్త్రీగా పరిగణించారు. అంతేకాదు భూమి, ప్రకృతి, రుతువులు, ఓడలు కూడా స్త్రీలింగమే.
Ex : The Moon has hidden her face behind a cloud.
జాబిలమ్మ తన ముఖాన్ని మేఘం చాటున దాచుకుంది.
The ship lost all her boats in the storm.
తుఫాను దాటికి ఓడ తన పడవలనన్నింటినీ కోల్పోయింది.
ఇంగ్లీషులో సూర్యుడిని (Sun) పులింగంగా (Masculine Gender) పరిగణిస్తారు. ఎందుకంటే బలానికి, శక్తికి ప్రతీకలైన ప్రాణములేని వాటిని కూడా ప్రాణమున్నవాటిగా భావిస్తారు. సూర్యుడు బలానికి ప్రతీక. తన వాడీ వేడీ కిరణాలను ప్రదర్శించే శక్తివంతమైనవాడు కాబట్టి పులింగంగా పిలుస్తారు.
Ex : The Sun sheds his rays on rich and poor alike.
సూర్యుడు తన కిరణాలను ధనిక పేద అనే తేడాలేకుండా అందరిపై ప్రసరింపజేస్తాడు.
శీతాకాలం (Winter), వేసవికాలం (Summer), సమయం(Time) అనే వాటిని కూడా ఇంగ్లీషులో పులింగంగానే (Masculine Gender) పరిగణిస్తారు.

0 comments:
Post a Comment