Saturday, December 1, 2018

English grammar through telugu | Material nouns


Material Nouns గురించి తెలుసుకోడానికి ఒక నిమిషం చాలు

Tuesday, November 27, 2018

English Grammar through Telugu | Common nouns

Common nounsని అర్థం చేసుకోవ‌డం చాలా ఈజీ





Wednesday, November 21, 2018

English Grammar through Telugu | Kinds of Nouns | Proper Nouns

Proper Noun వాక్యం మ‌ధ్య‌లో వ‌చ్చినా capital letterతోనే మొద‌లు పెట్టాలా?





Saturday, November 10, 2018

Countable Nouns and Uncountable Nouns అంటే ఏంటి?

Countable Nouns, Uncountable Nouns విష‌యంలో చాలా మంది తిక‌మ‌క ప‌డుతుంటారు. కానీ వీటిని అర్థం చేసుకోవ‌డం చాలా ఈజీ. ప్ర‌పంచంలోని వ‌స్తువుల‌ను రెండు ర‌కాలుగా విభ‌జించ‌వ‌చ్చు. ఒక‌టి లెక్కించ‌ద‌గిన‌వి, రెండు లెక్కించ‌లేనివి. వీటి ఆధారంగానే నామ‌వాచ‌కాల‌ను కూడా Countable Nouns లేదా Countables (లెక్కించ‌ద‌గిన‌వి), Uncountable Nouns లేదా Uncountables (లెక్కించ‌లేనివి) అని విభ‌జించారు. 
Ex : మ‌నుషుల‌ను(men) ఒక‌రు, ఇద్ద‌రు, ముగ్గురు ఇలా లెక్కిస్తాం. జంతువులు (Animals), ప‌క్షులు (Birds), చెట్లు(Trees), మొక్క‌ల‌ను(Plants) కూడా ఒక‌టి, రెండు అని లెక్కించొచ్చు. ఒక బ్యాగు (one bag), రెండు క‌ప్పులు (two cups), మూడు పెన్నులు (three pens) ఇలా వ‌స్తువుల‌ను కూడా లెక్క‌పెడ‌తాం. కానీ ఒక పాలు(milk), ఒక నీరు(water), ఒక బంగారం(gold) అని అన‌లేం. ఎందుకంటే వీటిని లెక్కించ‌డం సాధ్యం కాదు. పాలు, నీళ్ల‌ను లీట‌ర్ల‌లో కొలుస్తాం. బంగారం, వెండిని(silver) గ్రాములు, కిలోల్లో తూకం వేస్తాం. చ‌క్కెర‌ (sugar), బియ్యం (rice), ప‌ప్పుల‌ను(grams) కిలోల్లో బ‌రువును తూకం వేస్తాంగానీ వాటిని లెక్కించ‌డం సాధ్యం కాదు. నేల‌పై ప‌రుచుకున్న బండ‌రాళ్లు (stone), ఇసుక (sand) ఇలాంటివాటిని లెక్కించ‌లేం. 

Countable Nouns లేదా Countables : Ex : man, animal, bird, tree, plant, bag, cup, pen, river, mountain....etc... 

Uncountable Nouns  లేదా Uncountables : Ex : milk, water, gold, ilver, sugar, rice, air, rain, glass, wool, stone, sand....etc...

Uncountablesని కూడా కొన్నిసార్లు Countablesగా వాడ‌తాం. ఉదాహ‌ర‌ణ‌కు waterను లెక్క‌పెట్ట‌లేం, కానీ water drops (నీటి బిందువుల‌ను) లెక్క‌పెట్ట‌గ‌లం. అలాగే ప‌రుచుకుని ఉన్న బండ‌రాళ్ల‌ను లెక్క‌పెట్టలేం. కానీ విడిగా ఉన్న రాళ్ల‌ను లెక్క‌పెట్ట‌గ‌లం. ఉదాహ‌ర‌ణ‌కు ఆ బాలుడు కోతిపైకి రెండు రాళ్లు విసిరాడు.
                              water - uncountable noun

Tuesday, October 23, 2018

Childhood, boyhood అనేవి noun గ్రూప్‌లో ఏ వ‌ర్గానికి చెందుతాయి?

ఇంత‌వ‌ర‌కు మ‌నం కంటితో చూడ‌ద‌గిన‌వి, ట‌చ్ చేయ‌గ‌లిగిన noun గ్రూపుల గురించి తెలుసుకున్నాం. కంటికి
క‌నిపించ‌నివి, కేవ‌లం ఆస్వాదించ గ‌లిగిన‌ నామ‌వాచ‌కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుణ‌ముల పేర్లు,
స్థితుల పేర్లు, శాస్త్ర‌ములు లేక క‌ళ‌ల పేర్లు ఈ వ‌ర్గంలోకి వ‌స్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు Childhood, boyhoodనే
తీసుకోండి. ఈ రెండు వ్య‌క్తి జీవితంలోని ప్రారంభ ద‌శ‌లు. మ‌నిషి ఎదుగుద‌ల క‌నిపిస్తుందికానీ... పెర‌గ‌డం
క‌నిపించ‌దు. అంటే వీటిని మ‌నం ఫీల‌వుతాంగానీ చూడ‌లేం. వీటినే Abstract Nouns అంటాం.
An Abstract Noun is usually the name of a quality, action or state అనేది దీని నిర్వ‌చ‌నం. వీటిలో చాలా
వ‌ర‌కు మ‌న భావ‌న‌లే. అంటే వీటిని మ‌నం ఫీల‌వుతాం (ఆస్వాదిస్తాం) కానీ చూడ‌లేం. Abstract Nounsలో 1. 
Qualities (గుణ‌ములు), 2. Action (ప‌ని), 3.State (స్థితి) ఉంటాయి.
Ex :
1. Qualities (గుణ‌ములు) : 
kindness (ద‌య‌ ), hardness (క‌ఠిన‌త్వ‌ము), goodness (మంచిత‌న‌ము), honesty (నిజాయితీ), bravery
(సాహ‌స‌ము), strength (బ‌ల‌ము), wisdom (తెలివి, విజ్ఙానం), darkness (చీక‌టి), brightness (వెలుతురు) 
freedom (స్వేచ్ఛ‌)

2. Action (ప‌ని) : theft (దొంగ‌త‌న‌ము), movement (క‌ద‌లిక‌), laughter (న‌వ్వు), judgement (తీర్పు),
hatred (అస‌హ్యించుకోవ‌డం)

3.State (స్థితి) : childhood (శైశ‌వ‌ము), boyhood (బాల్య‌ము), youth (య‌వ్వ‌న‌ము), slavery
(బానిస‌త్వ‌ము), sleep (నిద్ర‌ ), sickness (అనారోగ్యం), death (మ‌ర‌ణం) 

Saturday, October 13, 2018

Army అనేది ఏ ర‌క‌మైన Nounలోకి వ‌స్తుంది?

Army అనేది Collective Noun. సైన్యం అనేది జ‌వానుల స‌మూహం. అంటే మ‌నుషులు, వ‌స్తువులు లేదా జంతువుల స‌మూహాల‌ను తెలిపేదే క‌లెక్టివ్ నౌన్. 
A Collective Noun is the name of a number or collection of persons or things taken together and spoken of as one whole అనేది ఇంగ్లీష్ నిర్వ‌చ‌నం. Ex : Crowd (జ‌న స‌మూహం), Mob (అల్ల‌రిమూక‌), Fleet (ఓడ‌ల గుంపు), Herd (ప‌శువుల మంద‌), Bunch (గుత్తి) మొద‌లైన‌వి...

Friday, October 12, 2018

Milk అనేది ఏ ర‌క‌మైన nounలోకి వ‌స్తుంది?

మ‌నం రోజూ తాగే పాలు కూడా ఒక noun. అలాగే Water, Oil, Ice, Rock కూడా. Milk, Water, Oil
అనేవి ద్ర‌వ ప‌దార్థాలు. Ice, Rock అనేవి ఘ‌న‌ప‌దార్థాలు. అంటే ఇవ‌న్నీ materials. అందుకే వీటిని Material 
Noun అంటారు.
Material Noun is the name of a material or substance అనేది దీని నిర్వ‌చ‌నం. విడివిడిగా కాకుండా
లెక్కించ‌డానికి వీలులేకుండా ఉండే ప‌దార్థాలు, వ‌స్తువుల పేర్లే మెటీరియ‌ల్ నౌన్స్. అంటే కుప్ప‌గాగాని,
ముద్ద‌గాగాని, ద్ర‌వ‌రూపంలోగాని, ఘ‌న‌రూపంలోగాని ఉన్న వ‌స్తువులు, ప‌దార్థాల పేర్లు.
వీటికి మ‌రిన్ని ఉదాహ‌ర‌ణ‌లు : Rice (బియ్యం, అన్నం), Sand (ఇసుక), Wool (ఉన్ని), Iron (ఇనుము).

Tuesday, October 9, 2018

Common noun విష‌యంలో ఎందుకు తిక‌మ‌క ప‌డ‌తారు?

2. Common Noun : A Common Noun is a name given in common to every person or thing.
పేర్లు వేరు. కానీ మ‌నుషులు ఒక‌టే క‌దా! అలాగే ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాలు కూడా. ఒక్కో న‌గ‌రానికి ఒక పేరుంటుంది. ఒక్కో మ‌నిషికి ఒక పేరుంటుంది. ఈ పేర్ల‌ను సూచించేవి ప్రాప‌ర్ నౌన్స్ అయితే... మ‌నుషులు, ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాలు అనేవి Common nouns. ఎందుకంటే మ‌నిషి అంటే ఎవ‌రైనా కావ‌చ్చు. బాలుడు అంటే ఏ బాలుడైనా కావ‌చ్చు. ప‌ట్ట‌ణం అంటే ఏ ప‌ట్ట‌ణ‌మైనా కావ‌చ్చు. అంటే ఇక్క‌డ సాధార‌ణంగా కొంత‌మందికి వ‌ర్తించేలా, లేదా కొన్ని వ‌స్తువులు, ప్ర‌దేశాల‌కు వ‌ర్తించేలా క‌లిపి చెప్తాం కాబ‌ట్టి దాన్ని కామ‌న్ నౌన్ అంటాం.
Ex : Krishna is a good boy. ఇందులో boy అనేది Common Noun. ఎందుకంటే Krishna అనేది ప్ర‌త్యేక‌మైన పేరు అంటే ప్రాప‌ర్ నౌన్. కానీ boy అనేది ఏ మ‌గ పిల్లాడికైనా వ‌ర్తిస్తుంది. అందుకే ఇది Common Noun.
       Radha is a good girl. ఇందులో girl అనేది Common Noun. ఎందుకంటే Radha అనేది ప్ర‌త్యేక‌మైన పేరు అంటే ప్రాప‌ర్ నౌన్. కానీ girl అనేది ఏ ఆడ పిల్ల‌కైనా వ‌ర్తిస్తుంది. అందుకే ఇది Common Noun.
     Hyderabad is the best city. ఇందులో city అనేది Common Noun. ఎందుకంటే Hyderabad అనేది ప్ర‌త్యేక‌మైన పేరు అంటే Proper noun. కానీ city అనేది ఏ నగ‌రానికైనా వాడొచ్చు. అందుకే ఇది Common Noun.
మ‌రికొన్ని ఉదాహ‌ర‌ణ‌లు : Man, woman, friend, student, town, village, river, vehicle, animal, tree, bird, insect...

Sunday, September 30, 2018

మ‌నుషుల పేర్ల‌ను ఎందుకు Capital letterతోనే మొద‌లు పెట్టాలి?

Kinds of Nouns : నామ‌వాచ‌కం ర‌కాలు

Noun : నామ‌వాచ‌కాన్ని సుల‌భంగా అర్థం చేసుకొని ఉప‌యోగించ‌డానికి వీలుగా ఐదు ర‌కాలుగా విభ‌జించారు.
అవేంటో తెలుసుకోవ‌డం వ‌ల్ల స‌రిగా వాడొచ్చు. అందుకే వీటిపై ప్రైమ‌రీ స్కూల్ నుంచే పిల్ల‌ల‌కు నేర్పిస్తున్నారు.
కొన్ని ప‌దాల‌ను ఇచ్చి అవి ఏ ర‌క‌మైన నామావాచ‌కాలో విభ‌జించాల్సిందిగా పిల్ల‌ల‌కు హోం వ‌ర్క్ కూడా ఇస్తున్నారు.
పైక్లాసుకు వెళ్లేకొద్దీ విద్యార్థులు వీటిపై (Nouns) ప‌ట్టుసాధిస్తారు. త‌ప్పులు దొర్ల‌కుండా ఉప‌యోగిస్తారు.
నామ‌వాచ‌కాల గురించి స‌రిగా తెలిస్తేనే వాటికి బ‌దులు ఎలాంటి స‌ర్వ‌నామాలు (Pronouns) ఉప‌యోగించాలి,
వాటితో ఎలాంటి క్రియ‌ల‌ను (Verbs) వాడాలో కూడా అర్థ‌మ‌వుతుంది.

Nouns are of five Kinds : నామ‌వాచ‌కాలు ఐదు ర‌కాలు 
------------------------------
1. Proper Nouns   2. Common Nouns  3. Material Nouns  4.Collective Nouns   5. Abstract 
Nouns

ముందుగా Proper Noun గురించి తెలుసుకుందాం.
1.Proper Noun : A Proper Noun is the name of some particular person, place or thing. వ్య‌క్తి పేరు,
ప్ర‌దేశ‌ము పేరు లేదా వ‌స్తువు పేరును సూచించేది Proper Noun. ఒక వ్య‌క్తిని మ‌నం ఎలా గుర్తుంచుకుంటాం.
పేరుతోనే క‌దా! ఒక ప్ర‌దేశాన్ని కూడా పేరుతోనే గుర్తుప‌డ‌తాం. వ‌స్తువుల‌ను కూడా వాటి పేర్ల‌తోనే గుర్తుపెట్టుకుంటాం. Proper అంటే ఒక‌రి సొంతం. Proper Nounను ఎప్పుడూ capital letter (పెద్ద అక్ష‌రం)తో మొద‌లుపెట్టాలి.
వాక్యం మ‌ధ్య‌లో వ‌చ్చినా స‌రే.
Ex : Krishna is a good boy.
       Radha is a good girl.
ఇక్క‌డ కృష్ణా అనేది బాలుడి పేరు. రాధా అనేది బాలిక పేరు. ఈ రెండు కూడా ప్ర‌త్యేక‌మైన పేర్లు కాబ‌ట్టి Proper
Nouns. అందుకే వీటిని capital letterతో ప్రారంభించాం.
      Hyderabad is the best city.
ఇక్క‌డ హైద‌రాబాద్ అనేది Proper Noun. అందుకే Hyderabadను capital letterతో మొద‌లు పెట్ట‌డం
త‌ప్ప‌నిస‌రి.


Friday, September 21, 2018

Tenses అంటే ఎందుకు tension?

చాలా మంది Tenses గురించి భ‌య‌ప‌డుతుంటారు. అవి అంత ఈజీగా అర్థం కావ‌నే అపోహ ఉంది. కానీ ఇది నిజం కాదు. ఎందుకంటే Tenses బాగా అర్థం కావాలంటే... ముందుగా Persons and Verbs గురించి తెలుసుకోవాలి. First Person, Second Person, Third Personకు Verbsకు మ‌ధ్య‌ ఉన్న సంబంధం ఏంటో అర్థం చేసుకోవాలి. అందులో భాగంగా Persons కోసం ముందుగా ఈ వీడియో చూడండి.