Sunday, September 30, 2018

మ‌నుషుల పేర్ల‌ను ఎందుకు Capital letterతోనే మొద‌లు పెట్టాలి?

Kinds of Nouns : నామ‌వాచ‌కం ర‌కాలు

Noun : నామ‌వాచ‌కాన్ని సుల‌భంగా అర్థం చేసుకొని ఉప‌యోగించ‌డానికి వీలుగా ఐదు ర‌కాలుగా విభ‌జించారు.
అవేంటో తెలుసుకోవ‌డం వ‌ల్ల స‌రిగా వాడొచ్చు. అందుకే వీటిపై ప్రైమ‌రీ స్కూల్ నుంచే పిల్ల‌ల‌కు నేర్పిస్తున్నారు.
కొన్ని ప‌దాల‌ను ఇచ్చి అవి ఏ ర‌క‌మైన నామావాచ‌కాలో విభ‌జించాల్సిందిగా పిల్ల‌ల‌కు హోం వ‌ర్క్ కూడా ఇస్తున్నారు.
పైక్లాసుకు వెళ్లేకొద్దీ విద్యార్థులు వీటిపై (Nouns) ప‌ట్టుసాధిస్తారు. త‌ప్పులు దొర్ల‌కుండా ఉప‌యోగిస్తారు.
నామ‌వాచ‌కాల గురించి స‌రిగా తెలిస్తేనే వాటికి బ‌దులు ఎలాంటి స‌ర్వ‌నామాలు (Pronouns) ఉప‌యోగించాలి,
వాటితో ఎలాంటి క్రియ‌ల‌ను (Verbs) వాడాలో కూడా అర్థ‌మ‌వుతుంది.

Nouns are of five Kinds : నామ‌వాచ‌కాలు ఐదు ర‌కాలు 
------------------------------
1. Proper Nouns   2. Common Nouns  3. Material Nouns  4.Collective Nouns   5. Abstract 
Nouns

ముందుగా Proper Noun గురించి తెలుసుకుందాం.
1.Proper Noun : A Proper Noun is the name of some particular person, place or thing. వ్య‌క్తి పేరు,
ప్ర‌దేశ‌ము పేరు లేదా వ‌స్తువు పేరును సూచించేది Proper Noun. ఒక వ్య‌క్తిని మ‌నం ఎలా గుర్తుంచుకుంటాం.
పేరుతోనే క‌దా! ఒక ప్ర‌దేశాన్ని కూడా పేరుతోనే గుర్తుప‌డ‌తాం. వ‌స్తువుల‌ను కూడా వాటి పేర్ల‌తోనే గుర్తుపెట్టుకుంటాం. Proper అంటే ఒక‌రి సొంతం. Proper Nounను ఎప్పుడూ capital letter (పెద్ద అక్ష‌రం)తో మొద‌లుపెట్టాలి.
వాక్యం మ‌ధ్య‌లో వ‌చ్చినా స‌రే.
Ex : Krishna is a good boy.
       Radha is a good girl.
ఇక్క‌డ కృష్ణా అనేది బాలుడి పేరు. రాధా అనేది బాలిక పేరు. ఈ రెండు కూడా ప్ర‌త్యేక‌మైన పేర్లు కాబ‌ట్టి Proper
Nouns. అందుకే వీటిని capital letterతో ప్రారంభించాం.
      Hyderabad is the best city.
ఇక్క‌డ హైద‌రాబాద్ అనేది Proper Noun. అందుకే Hyderabadను capital letterతో మొద‌లు పెట్ట‌డం
త‌ప్ప‌నిస‌రి.


0 comments:

Post a Comment