Tuesday, October 9, 2018

Common noun విష‌యంలో ఎందుకు తిక‌మ‌క ప‌డ‌తారు?

2. Common Noun : A Common Noun is a name given in common to every person or thing.
పేర్లు వేరు. కానీ మ‌నుషులు ఒక‌టే క‌దా! అలాగే ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాలు కూడా. ఒక్కో న‌గ‌రానికి ఒక పేరుంటుంది. ఒక్కో మ‌నిషికి ఒక పేరుంటుంది. ఈ పేర్ల‌ను సూచించేవి ప్రాప‌ర్ నౌన్స్ అయితే... మ‌నుషులు, ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాలు అనేవి Common nouns. ఎందుకంటే మ‌నిషి అంటే ఎవ‌రైనా కావ‌చ్చు. బాలుడు అంటే ఏ బాలుడైనా కావ‌చ్చు. ప‌ట్ట‌ణం అంటే ఏ ప‌ట్ట‌ణ‌మైనా కావ‌చ్చు. అంటే ఇక్క‌డ సాధార‌ణంగా కొంత‌మందికి వ‌ర్తించేలా, లేదా కొన్ని వ‌స్తువులు, ప్ర‌దేశాల‌కు వ‌ర్తించేలా క‌లిపి చెప్తాం కాబ‌ట్టి దాన్ని కామ‌న్ నౌన్ అంటాం.
Ex : Krishna is a good boy. ఇందులో boy అనేది Common Noun. ఎందుకంటే Krishna అనేది ప్ర‌త్యేక‌మైన పేరు అంటే ప్రాప‌ర్ నౌన్. కానీ boy అనేది ఏ మ‌గ పిల్లాడికైనా వ‌ర్తిస్తుంది. అందుకే ఇది Common Noun.
       Radha is a good girl. ఇందులో girl అనేది Common Noun. ఎందుకంటే Radha అనేది ప్ర‌త్యేక‌మైన పేరు అంటే ప్రాప‌ర్ నౌన్. కానీ girl అనేది ఏ ఆడ పిల్ల‌కైనా వ‌ర్తిస్తుంది. అందుకే ఇది Common Noun.
     Hyderabad is the best city. ఇందులో city అనేది Common Noun. ఎందుకంటే Hyderabad అనేది ప్ర‌త్యేక‌మైన పేరు అంటే Proper noun. కానీ city అనేది ఏ నగ‌రానికైనా వాడొచ్చు. అందుకే ఇది Common Noun.
మ‌రికొన్ని ఉదాహ‌ర‌ణ‌లు : Man, woman, friend, student, town, village, river, vehicle, animal, tree, bird, insect...

0 comments:

Post a Comment