మొబైల్ ఫోన్ ని ఉపయోగించుకుని పదసంపదను ఎలా పెంపొందించుకోవాలి?
Vocabularyని పెంపొందించుకోడానికి ఎన్నో పద్ధతులున్నాయి. వాటిలో ఒకటి మొబైల్ ను ఉపయోగించి నేర్చుకోవడం. మన చేతిలోని సెల్ ఫోన్ ఒక మినీ కంప్యూటర్ లాంటిది. మొబైల్ ఫోన్ లో ఎన్నో ఫీచర్లు, యాప్ లు ఉంటాయి. వాటిలో Vocabularyని నేర్చుకోడానికి అవసరమైన పదింటి గురించి తెలుసుకుందాం.
1.Google Chrome
2. Notes / S Memo
3. Reminder
4. G-Board
5. Whatsapp
6. Audio Books
7. Recorder
8. Video Camera
9. Gmail/Google Drive
10.Youtube
1.Google Chrome : డెస్క్ టాప్ లో ఎలాగైతే టాపిక్స్ కోసం, పదాల అర్థాల కోసం గూగుల్ సర్చ్ ఇంజన్ గూగుల్ క్రోమ్ లో వెతుకుతామో... మొబైల్ లోనూ గూగుల్ క్రోమ్ ను అలాగే వాడుకోవచ్చు. మనం ఏవైనా పుస్తకాలు, న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడుగానీ, టీవీలో ఇంగ్లీష్ న్యూస్ చూస్తున్నప్పుడుగానీ కొత్త కొత్త పదాలు వస్తుంటాయి. వాటికి వెంటనే అర్థం తెలుసుకోవాలంటే డిక్షనరిలో చూడడం అన్ని వేళలా సాధ్యం కాదు. అందుకే వెంటనే గూగుల్ క్రోమ్ లో కొత్త పదాన్ని టైప్ చేసి దాని పక్కన meaning అని టైప్ చేయాలి. Ex : Beauty meaning అని టైప్ చేయగానే వెంటనే కొన్ని కీవర్డ్స్ లిస్ట్ వస్తుంది. అందులో మనకు కావల్సిన beauty meaning in telugu అనేదాన్ని సెలెక్ట్ చేసుకుని సర్చ్ చేస్తే చాలు వెంటనే 'అందం' అనే అర్థం కనిపిస్తుంది. అర్థంతోపాటు కొత్త పదం spelling కూడా గుర్తుంచుకోవాలి. అంతేకాదు... ఆ పదాన్ని ఎలా ఉచ్ఛరిస్తారో కూడా తెలుసుకోవాలి. అందుకోసం గూగుల్ క్రోమ్ లోనే మనకు కావల్సిన wordని టైప్ చేసి దాని పక్కనే pronunciation అని టైప్ చేయాలి. Ex : beauty pronunciation అని టైప్ చేసి సర్చ్ చేయగానే ఒక ఆడియో సింబల్, దాని పక్కనే mouth సింబల్ ప్రత్యక్షమవుతాయి. ఆడియో సింబల్ పై ప్రెస్ చేయగానే ఆ పదాన్ని ఎలా ఉచ్ఛరిస్తారో వాయిస్ వినిపిస్తుంది. అర్థం, ఉచ్ఛరణలతోపాటే గ్రామర్ ను కూడా తెలుసుకోవచ్చు. అంటే ఆ పదం Noun / Verb అనేది కూడా తెలిసిపోతుంది. అందుకోసం మనం Ex : beauty grammar అని సర్చ్ చేయాలి.
2. Notes / S Memo : కొన్నిసార్లు మనం కొత్త పదాలకు వెంటనే అర్థం కోసం గూగుల్ క్రోమ్ లో సర్చ్ చేసే వీలు లేకపోవచ్చు. దానికి రకరకాల కారణాలుండొచ్చు. నెట్ సరిగా పనిచేయకపోవడం, టైం లేకపోవడం వల్ల ఆ పదాలను అంతటితో వదిలేస్తాం. అలా కాకుండా కొత్త పదాలను మన మొబైల్ ఫోన్ లోనే save చేసుకునే వీలుంది. అందుకోసం Notes / S Memoను ఉపయోగించుకోవాలి. కొన్ని ఫోన్లలో Notes ఉంటే మరికొన్నింటిలోS Memo ఉంటుంది. అందులో పదాన్ని టైప్ చేసి సేవ్ చేసుకోవచ్చు. వీలైనప్పుడు ఆ పదానికి అర్థం తెలుసుకోవచ్చు.
3. Reminder : మనం Notes / S Memoలో సేవ్ చేసుకున్నాసరే కొన్నిసార్లు మరిచిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసం Reminderని వాడుకోవాలి. Notesలో ఒక పదాన్ని సేవ్ చేసిన తర్వాత పైన మూడు నిలువు చుక్కలు కనిపిస్తాయి. వాటిని ప్రెస్ చేస్తే రిమైండర్ తోపాటు మరికొన్ని ఆప్షన్స్ వస్తాయి. రిమైండర్ ను సెలెక్ట్ చేసుకుంటే కింద Date, time వస్తాయి. మనం ఫ్రీగా ఉండే టైంను ఎంచుకుని Reminderని సెట్ చేసుకుంటే ఆ సమయానికి అలారం మోగుతుంది. అప్పుడు కొత్త పదానికి డిక్షనరిలోగానీ, ఆన్ లైన్ డిక్షనరిలోగానీ అర్థం వెతుక్కోవచ్చు.
4. G-Board : Notesలో సేవ్ చేసుకున్న పదాలకు తెలుగులో అర్థాలను కూడా రాసుకోవచ్చు. అందుకోసం తెలుగు టైపింగ్ టూల్ అవసరం అవుతుంది. ఎన్నో టైపింగ్ టూల్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి Gboard. ఈ మల్టీ లింగువల్ టైపింగ్ టూల్ ను గూగుల్ డెవలప్ చేసింది. Google Play store నుంచి download చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవాలి. Whatsappలోకి వెళ్లి దీని సెట్టింగ్స్ ని మార్చుకోవచ్చు. ఈ ఒక్క టైపింగ్ టూల్ తో Notes, Whatsapp, Facebook తదితరవాటిలో తెలుగులోనూ టైప్ చేసుకోవచ్చు.
5. Whatsapp : Vocabularyని నేర్చుకోవాలనుకునే తపన ఫ్రెండ్స్, బంధువుల్లో కొందరికి ఉండొచ్చు. అలాంటి వారిని గుర్తించి Whatsappలో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. మనం నేర్చుకున్న పదాలను మిగతావారికి షేర్ చేస్తే... వాళ్లు నేర్చుకున్నవి మనకు పంపిస్తారు. ఇలా చాలా తక్కువ టైంలోనే ఎక్కువ కొత్త పదాలను నేర్చుకునే వీలుంటుంది.
6. Audio Books : కొత్త కొత్త పదాలు నేర్చుకోడానికి ఉపయోగపడేవి ఆడియో బుక్స్. వీటి ద్వారా English languageని నేర్చుకోవచ్చు. ఇంతకుముందైతే నవలలు, పుస్తకాలు, మ్యాగజైన్లు, మాసపత్రికలు జనం ఎక్కువగా చదివేవారు. కానీ మొబైల్ విప్లవం వచ్చిన తర్వాత అంతా ఆన్ లైన్ కే అడిక్ట్ అయ్యారు. చాలామంది పుస్తకాలు చదవడం మానేశారు. ప్రతి విషయానికి గూగుల్ తల్లిపై ఆధారపడుతున్నారు. ఇలాంటి వారి కోసమే ఆడియో బుక్స్ వచ్చేశాయి. Google Chromeలో Free audio books అని సర్చ్ చేయగానే పెద్ద లిస్ట్ వచ్చేస్తుంది. మనకు అవసరమైనవాటిని డౌన్ లోడ్ చేసుకోవాలి. ఫ్రీటైంలో వాటిని వినొచ్చు. లేదంటే ఆడియో బుక్స్ ని మన మొబైలో ప్లే చేసి వాటిని వింటూ ఎంచక్కా మన పనులు మనం చేసుకోవచ్చు. కొత్తగా అనిపించిన పదాలకు వెంటనే అర్థాలు తెలుసుకుంటే Vocabulary improve అవుతుంది. అదే టైంలో English languageపై పట్టు వస్తుంది.
7. Recorder : మొబైల్ లో ఉండే ఫీచర్లలో ఒకటి ఆడియో రికార్డర్. మనం నేర్చుకునే కొత్త పదాలను ఇందులో రికార్డ్ చేసుకుని దాచుకోవచ్చు. వీలైనప్పుడు వింటూ ఉంటే పదేపదే గుర్తు చేసుకున్నట్లు ఉంటుంది. తద్వారా వాటిని మనం మర్చిపోలేము. అంతేకాదు మన ఉచ్చరణ ఎలా ఉందో కూడా తెలుస్తుంది. ఎక్కడైనా సరిగా ఉచ్చరించలేదనిపిస్తే మెరుగుపరుచుకునే వీలుంటుంది.
8. Video Camera : మొబైల్ లో ఉండే ఫీచర్లలో మనం ఎక్కువగా వాడే వాటిలో ఒకటి వీడియో కెమెరా. కేవలం ఏవేవో వీడియోలు తీసుకోడానికే కాకుండా... Vocabularyని improve చేసుకోడానికి కూడా వాడుకోవచ్చు. అదేలాగంటే మనం నేర్చుకున్న పదాలను బిగ్గరగా ఉచ్చరిస్తూ వీడియో కెమెరాతో రికార్డ్ చేయాలి. వాటిని ప్లే చేసుకుని చూస్తే మన ముఖకవళికలు ఎలా ఉన్నాయి. సరిగా ఉచ్చరిస్తున్నామా లేదా అనేది తెలిసిపోతుంది. ఏవైనా లోపాలుంటే వాటిని సరిచేసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మనల్ని మనం సమీక్షించుకోవడమే.
9. Gmail/Google Drive : మనం నేర్చుకున్న కొత్త కొత్త అర్థాలను ఇతరులకు పంపించాలన్నా, చాలా కాలం దాచుకోవాలన్నా మనకు ఉపయోగపడేవి Gmail మరియు Google Drive. మన మొబైల్ లో స్టోరేజీ ఫుల్ అయితే కొన్ని వీడియోలు, ఫొటోలను డిలీట్ చేయక తప్పదు. అంటే వాటిని మనం కోల్పోవల్సి వస్తుంది. అలా కాకుండా వాటిని మనం ఆన్ లైన్ లో స్టోర్ చేసుకోవచ్చు. Gmail అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ Google వాళ్లు 15 GB ఫ్రీ స్పేస్ ఇస్తున్నారు. అయితే ఇది Gmail మరియు Google Driveకు కలిపి ఉంటుంది. కొత్తగా నేర్చుకున్న పదాలను Gmail ద్వారా ఇతరులకు పంపించొచ్చు. మన వీడియోలు, ఫొటోలు, మిగతా డాక్యుమెంట్లను Google Driveలో దాచుకోవచ్చు. Gmail ఐడీ మరియు passwordతోనే Google Driveని లాగిన్ అవ్వొచ్చు. అంతేకాదు Gmail ఐడీ మరియు passwordతోనే Youtubeతో సహా చాలా Google productsలో లాగిన్ అవ్వొచ్చు. Google Driveలో స్టోర్ చేసుకున్నవాటిని ప్లే చేసుకుని మళ్లీ మళ్లీ వినొచ్చు.
10.Youtube : దీని గురించి ప్రపంచంలో తెలియనివారు లేరంటే అతిశయోక్తికాదు. చిన్న పిల్లలు కూడా మొబైల్ తీసుకుని వాళ్లే స్వయంగా Youtubeని ఓపెన్ చేసి వీడియోలు చూస్తుంటారంటే అది ఎంత ఫేమసో అర్థమవుతుంది. ఒకరకంగా చెప్పాలంటే సమాచారం, విద్య, వినోదం కోసం యావత్ ప్రపంచం యూట్యూబ్ పై ఆదారపడుతోంది. Youtubeలో పాఠాలు నేర్చుకోవడంతోపాటు Vocabularyని కూడా improve చేసుకోవచ్చు. అదెలాగంటే Google Chromeలో ఎలాగైతే pronunciation కోసం వెతుకుతామో... వాటిని Youtubeలోనూ సర్చ్ చేయొచ్చు. Ex : beauty pronunciation అని సర్చ్ చేయగానే అందుకు సంబంధించిన రకరకాల వీడియోలు ప్రత్యక్షమవుతాయి. వీడియో ప్లే చేయగానే ఆ పదాన్ని ఎలా ఉచ్చరిస్తారో వాయిస్ వినిపిస్తుంది. English language నేర్చుకోడానికి Youtube మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.