Noun

Noun - నామవాచకము

Noun : A noun is a naming word. It names person, place or thing. మనుషులు, వస్తువులు, ప్రదేశాల పేర్లను తెలిపేదే నామవాచకము. 

ప్రతి మనిషికి ఒక పేరుంటుంది. ప్రతి వస్తువుకు ఒక పేరుంటుంది. ప్రతి ప్రదేశానికి ఒక పేరుంటుంది. అంతేకాదు... నదులు, సరస్సులు, సముద్రాలు, వారాలు, నెలలు... ఇలాంటి పేర్లన్నీ నామవాచకాలే.

Parts of Speechలో Nounను Head of the familyఅంటారు.

Nounను ఎలా ఉపయోగించాలో ఉదాహరణలతోసహా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.Click here for video


Kinds of Nouns : నామ‌వాచ‌కం ర‌కాలు

Noun : నామ‌వాచ‌కాన్ని సుల‌భంగా అర్థం చేసుకొని ఉప‌యోగించ‌డానికి వీలుగా ఐదు ర‌కాలుగా విభ‌జించారు. అవేంటో తెలుసుకోవ‌డం వ‌ల్ల స‌రిగా వాడొచ్చు. అందుకే వీటిపై ప్రైమ‌రీ స్కూల్ నుంచే పిల్ల‌ల‌కు నేర్పిస్తున్నారు. కొన్ని ప‌దాల‌ను ఇచ్చి అవి ఏ ర‌క‌మైన నామావాచ‌కాలో విభ‌జించాల్సిందిగా పిల్ల‌ల‌కు హోం వ‌ర్క్ కూడా ఇస్తున్నారు. పైక్లాసుకు వెళ్లేకొద్దీ విద్యార్థులు వీటిపై (Nouns) ప‌ట్టుసాధిస్తారు. త‌ప్పులు దొర్ల‌కుండా ఉప‌యోగిస్తారు. నామ‌వాచ‌కాల గురించి స‌రిగా తెలిస్తేనే వాటికి బ‌దులు ఎలాంటి స‌ర్వ‌నామాలు (Pronouns) ఉప‌యోగించాలి, వాటితో ఎలాంటి క్రియ‌ల‌ను (Verbs) వాడాలో కూడా అర్థ‌మ‌వుతుంది.


Nouns are of five Kinds : నామ‌వాచ‌కాలు ఐదు ర‌కాలు 

1. Proper Nouns   2. Common Nouns  3. Material Nouns  4.Collective Nouns   5. Abstract Nouns

1.Proper Noun : A Proper Noun is the name of some particular person, place or thing. వ్య‌క్తి పేరు, ప్ర‌దేశ‌ము పేరు లేదా వ‌స్తువు పేరును సూచించేది Proper Noun. ఒక వ్య‌క్తిని మ‌నం ఎలా గుర్తుంచుకుంటాం. పేరుతోనే క‌దా! ఒక ప్ర‌దేశాన్ని కూడా పేరుతోనే గుర్తుప‌డ‌తాం. వ‌స్తువుల‌ను కూడా వాటి పేర్ల‌తోనే గుర్తుపెట్టుకుంటాం. 

Proper అంటే ఒక‌రి సొంతం. Propern Nounను ఎప్పుడూ capital letter (పెద్ద అక్ష‌రం)తో మొద‌లుపెట్టాలి. వాక్యం మ‌ధ్య‌లో వ‌చ్చినా స‌రే. 
Ex : Krishna is a good boy. 
       Radha is a good girl.  
ఇక్క‌డ కృష్ణా అనేది బాలుడి పేరు. రాధా అనేది బాలిక పేరు. ఈ రెండు కూడా ప్ర‌త్యేక‌మైన పేర్లు కాబ‌ట్టి Proper Nouns. 
      Hyderabad is the best city. 
ఇక్క‌డ హైద‌రాబాద్ అనేది Proper Noun. 

2. Common Noun : A Common Noun is a name given in common to every person or thing. సాధార‌ణంగా క‌లిపి పిలిచే ప‌దాల‌ను అంటే ఎక్కువ మందికి లేదా వ‌స్తువుల‌కు వ‌ర్తించే ప‌దాల‌ను Common Nouns అంటాం.

Ex : Krishna is a good boy. ఇందులో boy అనేది Common Noun. ఎందుకంటే Krishna అనేది ప్ర‌త్యేక‌మైన పేరు అంటే ప్రాప‌ర్ నౌన్. కానీ boy అనేది ఏ మ‌గ పిల్లాడికైనా వ‌ర్తిస్తుంది. అందుకే ఇది Common Noun.
       Radha is a good girl. ఇందులో girl అనేది Common Noun. ఎందుకంటే Radha అనేది ప్ర‌త్యేక‌మైన పేరు అంటే ప్రాప‌ర్ నౌన్. కానీ girl అనేది ఏ ఆడ పిల్ల‌కైనా వ‌ర్తిస్తుంది. అందుకే ఇది Common Noun. 
     Hyderabad is the best city. ఇందులో city అనేది Common Noun. ఎందుకంటే Hyderabad అనేది ప్ర‌త్యేక‌మైన పేరు అంటే ప్రాప‌ర్ నౌన్. కానీ city అనేది ఏ నగ‌రానికైనా వాడొచ్చు. అందుకే ఇది Common Noun.
మ‌రికొన్ని ఉదాహ‌ర‌ణ‌లు : Man, woman, friend, student, town, village, river, vehicle, animal, tree, bird, insect... 

3. Material Noun : Material Noun is the name of a material or substance. విడివిడిగా కాకుండా లెక్కించ‌డానికి వీలులేకుండా ఉండే ప‌దార్థాలు, వ‌స్తువుల పేర్లే మెటీరియ‌ల్ నౌన్స్. అంటే కుప్ప‌గాగాని, ముద్ద‌గాగాని, ద్ర‌వ‌రూపంలోగాని, ఘ‌న‌రూపంలోగాని ఉన్న వ‌స్తువులు, ప‌దార్థాల పేర్లు. ఉదా : Rice (బియ్యం, అన్నం), Sand (ఇసుక), Wool (ఉన్ని), Iron (ఇనుము), Oil (నూనె), Water (నీరు), Milk (పాలు), Ice (మంచుగ‌డ్డ‌), Rock (బండ‌రాయి) మొద‌లైన‌వి...

4. Collective Noun : A Collective Noun is the name of a number or collection of persons or things taken together and spoken of as one whole. మ‌నుషులు, వ‌స్తువులు లేదా జంతువుల స‌మూహాల‌ను తెలిపేదే క‌లెక్టివ్ నౌన్. Ex : Crowd (జ‌న స‌మూహం), Mob (అల్ల‌రిమూక‌), Fleet (ఓడ‌ల గుంపు), Herd (ప‌శువుల మంద‌), Army (సైన్యం) Bunch (గుత్తి) మొద‌లైన‌వి...

5.Abstract Noun : An Abstract Noun is usually the name of a quality, action or state. గుణ‌ముల పేర్లు, స్థితుల పేర్లు, శాస్త్ర‌ములు లేక క‌ళ‌ల పేర్ల‌ను అబ్ స్ట్రాక్ట్ నౌన్ అంటాం. అంటే వేటినైతే మ‌నం ముట్టుకోలేమో, చూడ‌లేమో అలాంటివ‌న్నీఅబ్‌స్ట్రాక్ట్ నౌన్సే. వీటిలో చాలా వ‌ర‌కు మ‌న భావ‌న‌లే. అంటే వీటిని మ‌నం ఫీల‌వుతాం (ఆస్వాదిస్తాం) కానీ చూడ‌లేం.
Ex : 
1. Qualities (గుణ‌ములు) : 
kindness (ద‌య‌ ), hardness (క‌ఠిన‌త్వ‌ము), goodness (మంచిత‌న‌ము), honesty (నిజాయితీ), bravery
(సాహ‌స‌ము), strength (బ‌ల‌ము), wisdom (తెలివి, విజ్ఙానం), darkness (చీక‌టి), brightness (వెలుతురు)  
freedom (స్వేచ్ఛ‌)

2. Action (ప‌ని) : theft (దొంగ‌త‌న‌ము), movement (క‌ద‌లిక‌), laughter (న‌వ్వు), judgement (తీర్పు),
hatred (అస‌హ్యించుకోవ‌డం)

3.State (స్థితి) : childhood (శైశ‌వ‌ము), boyhood (బాల్య‌ము), youth (య‌వ్వ‌న‌ము), slavery (బానిస‌త్వ‌ము), sleep (నిద్ర‌ ), sickness (అనారోగ్యం), death (మ‌ర‌ణం)

Countable Nouns and Uncountable Nouns అంటే ఏంటి?


ప్ర‌పంచంలోని వ‌స్తువుల‌ను రెండు ర‌కాలుగా విభ‌జించ‌వ‌చ్చు. ఒక‌టి లెక్కించ‌ద‌గిన‌వి, రెండు లెక్కించ‌లేనివి. దీని ఆధారంగానే నామ‌వాచ‌కాల‌ను కూడా Countable Nouns లేదా Countables (లెక్కించ‌ద‌గిన‌వి), Uncountable Nouns లేదా Uncountables (లెక్కించ‌లేనివి) అని విభ‌జించారు.
Ex : మ‌నుషుల‌ను(men) ఒక‌రు, ఇద్ద‌రు, ముగ్గురు ఇలా లెక్కిస్తాం. జంతువులు (Animals), ప‌క్షులు (Birds),
చెట్లు(Trees), మొక్క‌ల‌ను(Plants) కూడా ఒక‌టి, రెండు అని లెక్కించొచ్చు. ఒక బ్యాగు (one bag), రెండు క‌ప్పులు (two cups), మూడు పెన్నులు (three pens) ఇలా వ‌స్తువుల‌ను కూడా లెక్క‌పెడ‌తాం. కానీ ఒక పాలు(milk), ఒక
నీరు(water), ఒక బంగారం(gold) అని అన‌లేం. ఎందుకంటే వీటిని లెక్కించ‌డం సాధ్యం కాదు. పాలు, నీళ్ల‌ను లీట‌ర్ల‌లో కొలుస్తాం. బంగారం, వెండిని(silver) గ్రాములు, కిలోల్లో తూకం వేస్తాం. చ‌క్కెర‌ (sugar), బియ్యం (rice), ప‌ప్పుల‌ను(grams) కిలోల్లో బ‌రువును తూకం వేస్తాంగానీ వాటిని లెక్కించ‌డం సాధ్యం కాదు. నేల‌పై ప‌రుచుకున్న బండ‌రాళ్లు (stone), ఇసుక (sand) ఇలాంటివాటిని లెక్కించ‌లేం.

Countable Nouns లేదా Countables : Ex : man, animal, bird, tree, plant, bag, cup,
pen, river, mountain....etc...

Uncountable Nouns  లేదా Uncountables : Ex : milk, water, gold, silver, sugar, rice,
air, rain, glass, wool, stone, sand....etc...

Uncountablesని కూడా కొన్నిసార్లు Countablesగా వాడ‌తాం. ఉదాహ‌ర‌ణ‌కు waterను లెక్క‌పెట్ట‌లేం, కానీ water
drops (నీటి బిందువుల‌ను) లెక్క‌పెట్ట‌గ‌లం. ప‌రుచుకుని ఉన్న బండ‌రాళ్ల‌ను లెక్క‌పెట్టలేం. కానీ విడిగా ఉన్న రాళ్ల‌ను లెక్క‌పెట్ట‌గ‌లం. ఉదాహ‌ర‌ణ‌కు ఆ బాలుడు కోతిపైకి రెండు రాళ్లు విసిరాడు.
-------------


The Noun Gender

---------------------
సృష్టి కొన‌సాగాలంటే సంతానం వృద్ధి చెందాలి. పిల్ల‌ల పుట్టుక ఆగిపోయిందంటే జ‌నాభా త‌గ్గిపోతుంది. క్ర‌మంగా భూమిపై మ‌నుషులతోపాటు జీవ‌జాతులు అంత‌రించిపోతాయి. అందుకే సృష్టి కార్యాన్ని కొన‌సాగించేవి ఆడ‌, మ‌గ మాత్రమే. భూమిపై ఈ రెండే ప్ర‌ధాన జాతులు. వీటితోపాటు ఈ రెండింటిని క‌లిపి చెప్పేది ఒక‌వ‌ర్గం, ఈ రెండింటికీ చెంద‌నిది మ‌రో వ‌ర్గం కూడా ఉన్నాయి. వీటినే మ‌నం లింగ‌భేదంగా చెప్పుకుంటున్నాం. ఇంగ్లీషులో అయితే వీటిని Gender అంటాం.
ఇవన్నీ నామ‌వాచ‌కాలే కాబ‌ట్టి వీటిని Noun Groupలో చేర్చారు.
ఇంగ్లీషులో లింగ‌భేదాన్నిబ‌ట్టి ప్రాణుల‌ను నాలుగు ర‌కాలుగా విభ‌జించారు. అవి.

1. Masculine Gender : పురుష జాతి లేదా పులింగ‌ము 

A Noun that denotes a male animal is said to be of the Masculine Gender.

2. Feminine Gender  : స్త్రీజాతి లేదా స్త్రీలింగ‌ము 

A Noun that denotes a female animal is said to be of the Feminine Gender.

3. Common Gender : పురుష జాతికిగానీ, స్త్రీజాతికిగానీ చెందిన‌వి 

A Noun that denotes either a male or a female is said to be of the Common Gender.

4. Neuter Gender : ఆడ‌, మ‌గ కానిది అంటే న‌పుంస‌క‌లింగం 

A Noun that denotes a thing that is neither male nor female is said to be of Neuter Gender.

Examples : 


1. Masculine Gender : 

Man : మ‌నిషి, పురుషుడు
Boy  : బాలుడు
Hero : క‌థానాయ‌కుడు
Author : గ్రంథ‌క‌ర్త‌
Baron : భూస్వామి
Count : ప్ర‌భువు
Heir    : వార‌సుడు
Host   : గృహ‌స్థుడు          
       
2. Feminine Gender : 

Woman  : స్త్రీ
Girl  :      బాలిక
Heroine  : క‌థానాయ‌కి
Authoress : గ్రంథ ర‌చ‌యిత్రి
Baroness  : భూస్వామిని
Countess  : స్త్రీ ప్ర‌భువు
Heiress      : వార‌సురాలు
Hostess     :  గృహ‌స్థురాలు          

3. Common Gender :

Child : పిల్ల లేక పిల్ల‌వాడు
Friend : స్నేహితుడు లేక స్నేహితురాలు
Parent : త‌ల్లి లేక తండ్రి
Student : విద్యార్థి లేక విద్యార్థిని
Teacher : ఉపాధ్యాయుడు లేక ఉపాధ్యాయురాలు
Thief : దొంగ లేక దొంగ‌ది
Enemy : మ‌గ శ‌త్రువు లేక ఆడ శ‌త్రువు
Doctor : వైద్యుడు లేక వైద్యురాలు

4. Neuter Gender :

Book : పుస్త‌క‌ము
Pen : క‌ల‌ము
Ball : బంతి
Bat : బ్యాట్
Vehicle : వాహ‌న‌ము
స్త్రీలింగ‌ము, పులింగ‌ముల‌కు చెంద‌నివి, ప్రాణ‌ములేని వ‌స్తువులు ఇందులోకి వ‌స్తాయి. స్త్రీ, పురుష భేద‌ము తెలియ‌ని చెట్టు, చేప‌, చీమ వంటి ప్రాణులు కూడా Neuter Genderలోకే వస్తాయి.
--------------------

మ‌న చంద‌మామ ఇంగ్లీషులో స్త్రీలింగం (Feminine Gender) ఎలా అయ్యాడు?

చంద్రుడిని(Moon) మ‌నం చంద‌మామ అంటాం. అంటే పురుషుడు (Masculine Gender). కానీ ఇంగ్లీషులో చంద్రుడిని స్త్రీతో పోలుస్తారు. దీనికి కార‌ణం అందం, మృదుత్వం, చ‌ల్ల‌ద‌నం. వీటికి పేరుగాంచిన ప్రాణ‌ములేని వ‌స్తువుల‌ను ప్రాణ‌మున్న వాటిగా భావించి స్త్రీలింగంగా పిలుస్తారు. అందుకే చ‌ల్ల‌ని వెన్నెలె కురిపించే అంద‌మైన చంద్రుడు, క‌వుల క‌లం నుంచి క‌విత‌లుగా జాలువారే మ‌న చంద‌మామ‌ను ఇంగ్లీషులో స్త్రీగా ప‌రిగ‌ణించారు. అంతేకాదు భూమి, ప్ర‌కృతి, రుతువులు, ప‌డ‌వ‌లు కూడా స్త్రీలింగ‌మే.
Ex : The Moon has hidden her face behind a cloud.
జాబిల‌మ్మ త‌న ముఖాన్ని మేఘం చాటున‌ దాచుకుంది.      
The ship lost all her boats in the storm.
తుఫాను దాటికి ఓడ తన ప‌డ‌వ‌ల‌న‌న్నింటినీ కోల్పోయింది.
ఇంగ్లీషులో సూర్యుడిని (Sun) పులింగంగా (Masculine Gender) ప‌రిగ‌ణిస్తారు. ఎందుకంటే బ‌లానికి, శ‌క్తికి ప్ర‌తీక‌లైన ప్రాణ‌ములేని వాటిని కూడా ప్రాణ‌మున్న‌వాటిగా భావిస్తారు. సూర్యుడు బ‌లానికి ప్ర‌తీక‌. త‌న వాడీ వేడీ కిర‌ణాల‌ను ప్ర‌ద‌ర్శించే శ‌క్తివంత‌మైన‌వాడు కాబ‌ట్టి పులింగంగా పిలుస్తారు.
Ex : The Sun sheds his rays on rich and poor alike.
సూర్యుడు త‌న కిర‌ణాల‌ను ధ‌నిక పేద అనే తేడాలేకుండా అందరిపై ప్ర‌స‌రింప‌జేస్తాడు.
శీతాకాలం (Winter), వేస‌వికాలం (Summer), స‌మ‌యం(Time) అనే వాటిని కూడా ఇంగ్లీషులో పులింగంగానే (Masculine Gender) ప‌రిగ‌ణిస్తారు.

English Gender wordsని తెలుగులో ఎందుకు త‌ప్పుగా వాడుతున్నాం?

చాలా ఇంగ్లీష్ ప‌దాలు తెలుగు వాడ‌కంలో ఇమిడిపోయాయి. అది ఎంత‌గా అంటే చ‌దువురానివారు కూడా వాటిని త‌మ వాడుక‌భాష‌లో ఉప‌యోగించేటంత‌. అయితే బాగా చ‌దువుకున్న‌వారు కూడా కొన్ని ప‌దాల వాడ‌కం విష‌యంలో త‌ప్పు చేస్తున్నారు. ఇప్పుడు మ‌నం Gender గురించి మాట్లాడుకుంటున్నాం కాబ‌ట్టి వీటి వాడకంలో చేసే కొన్ని త‌ప్పుల గురించి చూద్దాం.
తెలుగులో వైద్యుడు, వైద్యురాలు అని వాడ‌తాం. వీటికి ఇంగ్లీషులో స‌రిపోయే ప‌దాలే ఉన్నాయి. అవి వైద్యుడు-Doctor, వైద్యురాలు-Doctress. కానీ మ‌నం ఇద్ద‌రినీ Doctor అనే సంబోధిస్తాం. మ‌రికొంత‌మంది మాత్రం వైద్యురాలికి ఇంగ్లీషు ప‌దం ముందు Lady చేర్చి Lady Doctor అని పిలుస్తున్నారు.
మార్గ‌ద‌ర్శి, లేదా బ‌స్సులో టికెట్లు ఇచ్చే వ్య‌క్తి - Conductor, మార్గ‌ద‌ర్శిని, లేదా బ‌స్సులో టికెట్లు ఇచ్చే స్త్రీ - Conductress. కానీ మ‌నం మాత్రం ఇద్ద‌రినీ Conductor అనే సంబోధిస్తాం. అలాగే కండ‌క్ట‌ర్‌ను కూడా Lady చేర్చి Lady Conductor అని వాడుతున్నారు.          
వీటికి మ‌రిన్ని ఉదాహ‌ర‌ణాలు :
కార్య‌నిర్వాహ‌కుడు - Manager, కార్య‌నిర్వాహ‌కురాలు - Manageress. మ‌నం మాత్రం ఇద్ద‌రినీ Manager అనే అంటాం.
న‌గ‌ర అధ్య‌క్షుడు - Mayor, న‌గ‌ర అధ్య‌క్షురాలు - Mayoress. మ‌నం మాత్రం ఇద్ద‌రినీ Mayor అనే పిలుస్తాం.
==================

Masculine Gender(పులింగ‌ము) నుంచి Feminine Genders (స్త్రీలింగ‌ము) ముఖ్యంగా 4 ర‌కాలుగా ఏర్ప‌డుతాయి.  

1. పులింగంలో ఉండే ప‌దాన్ని పూర్తిగా మార్చ‌డం వ‌ల్ల స్త్రీలింగం ఏర్ప‌డుతుంది. 

మ‌నుషులు, బంధాలు :  

Bachelor - బ్ర‌హ్మ‌చారి               Maid (or) Spinster -క‌న్య‌ 
Boy -బాలుడు                        Girl - బాలిక‌
Brother -సోద‌రుడు                 Sister - సోద‌రి  
Father - తండ్రి                        Mother - త‌ల్లి 
Son -కొడుకు                          Daughter - కూతురు
Husband - భ‌ర్త                       Wife - భార్య‌ 
Man -పురుషుడు                    Woman - స్త్రీ  
Nephew -మేన‌ల్లుడు                Neice -మేన‌కోడలు 
Uncle -పిన‌తండ్రి, మేన‌మామ    Aunt - పిన‌త‌ల్లి, మేన‌త్త 
Sir -అయ్యా                           Madam - అమ్మా  
Monk - స‌న్యాసి                     Nun -స‌న్యాసిని 
Gentleman - పెద్ద‌మ‌నిషి          Lady - పెద్దామె 
King - రాజు                          Queen -రాణి
Earl -ప్ర‌భువు                        Countess - ప్ర‌భ్వి
Wizard - మాంత్రికుడు             Witch - మంత్ర‌గ‌త్తె 

జంతువులు, ప‌క్షులు, కీట‌కాలు :

Boar - మ‌గ‌పంది                 Sow - ఆడ‌పంది
Buck -మ‌గ పావుర‌ము          Doe - ఆడ పావుర‌ము
Bull or Ox -ఎద్దు                 Cow - ఆవు 
Bullock -కోడెదూడ               Heifer - పెయ్య‌
Cock -పుంజు                       Hen - పెట్ట‌
Colt - మ‌గ గుర్ర‌పు పిల్ల          Filly -  ఆడ గుర్ర‌పు పిల్ల‌
Dog - మ‌గ కుక్క                  Bitch - ఆడ కుక్క
Drake - మ‌గ‌బాతు                Duck -ఆడ బాతు
Drone - మ‌గ తేనెటీగ          Bee - ఆడ‌తేనెటీగ‌
Gander - మ‌గ‌బాతు              Goose - ఆడ‌బాతు 
Hart -మ‌గ దుప్పి                  Doe - ఆడ‌దుప్పి
Ram -గొర్రెపొట్టేలు                  Eve -ఆడ గొర్రె 
Horse - మ‌గ‌గుర్ర‌ము             Mare - ఆడ‌గుర్ర‌ము 

2. Masculine Genderకు -ess, -ine, -trix, -a మొద‌లైన సిల‌బుల్స్ చేర్చ‌డం వ‌ల్ల Feminine Genders ఏర్ప‌డ‌తాయి. 

Ex : 
Lion - మగ సింహం                   Lioness - ఆడ సింహం
Manager -కార్య‌నిర్వాహ‌కుడు      Manageress -కార్య‌నిర్వాహ‌కురాలు  
Mayor -న‌గ‌ర అధ్య‌క్షుడు           Mayoress - న‌గ‌ర అధ్య‌క్షురాలు
Poet -క‌వి                         Poetess -క‌వ‌యిత్రి 
Priest -అర్చ‌కుడు                    Priestess -అర్చ‌కురాలు
Shepherd -గొల్ల‌పిల్ల‌వాడు           Shepherdess -గొల్ల‌పిల్ల
Giant -రాక్ష‌సుడు                 Giantess -రాక్ష‌సి
Hero -క‌థానాయ‌కుడు              Heroine -క‌థానాయ‌కురాలు  
Executor - నిర్వాహ‌కుడు          Executrix -నిర్వాహ‌కురాలు


0 comments:

Post a Comment