Verb - క్రియ
Verb : A verb is a doing word. It usually expresses an action or being.పని గురించిగాని, స్థితి గురించిగాని తెలిపే పదాన్ని verb (క్రియ) అంటారు.
క్రియను ఎలా ఉపయోగించాలో ఉదాహరణలతో సహా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
Irregular Verbs :
Present tense Past tense Past participle
వర్తమాన కాలం భూతకాలం సమీప భూతకాలం
Arise (లేచుట) - arose (లేచెను) -arisen (లేచెను)
Begin (మొదలుపెట్టు) - began (మొదలుపెట్టెను) - begun (మొదలుపెట్టెను)
Bear (భరించు) - bore (భరించెను) - born (భరించెను)
Begin (మొదలవడం) -began(మొదలయ్యెను) -begun(మొదలయ్యెను)
Break (విరగగొట్టు ) -broke (విరగగొట్టెను ) -broken (విరగగొట్టెను)
Bear (భరించు) - bore (భరించెను) - born (భరించెను)
Begin (మొదలవడం) -began(మొదలయ్యెను) -begun(మొదలయ్యెను)
Break (విరగగొట్టు ) -broke (విరగగొట్టెను ) -broken (విరగగొట్టెను)
Drink (తాగుట) - drank (తాగెను) - drunk (తాగెను)
Drive (నడుపు) - drove (నడిపెను) - driven (నడిపెను)
Find(కనుగొనుట) -found(కనుగొనెను) - found(కనుగొనెను)
Fight (పోట్లాట) -fought(పోట్లాడెను) - fought(పోట్లాడెను)
Go (వెళ్లు) -went (వెళ్లెను) - gone (వెళ్లెను)
Give (ఇచ్చు) - gave (ఇచ్చెను) - given (ఇచ్చెను)
Rise (ఉదయించు) rose(ఉదయించెను) risen (ఉదయించెను)
Speak (మాట్లాడు) - spoke (మాట్లాడెను) - spoken (మాట్లాడెను)
Shine (ప్రకాశించు) - shone(ప్రకాశించెను) - shone (ప్రకాశించెను)
Sing (పాడుట) sang(పాడెను) sung(పాడెను)
Sink (మునుగుట) -sank(మునిగెను) -sunk(మునిగెను)
Sit (కూర్చును) sat(కూర్చునెను) sat (కూర్చునెను)
Steal (దొంగిలించుట) stole (దొంగిలించెను) stolen (దొంగిలించెను)
Swear(ప్రమాణము చేయుట) -swore(ప్రమాణము చేసెను) -sworn(ప్రమాణము చేసెను)
Swim(ఈదుట) swam(ఈదెను) swum(ఈదెను)
Tear(చించుట) tore (చించెనె) torn (చించెను)
Wear(ధరించుట) wore(ధరించెను) worn(ధరించెను)
Win (గెలుచుట ) - won (గెలిచెను) - won (గెలిచెను)
Write (రాయుట) - wrote (రాసెను) - written (రాసెను)
Spit(ఉమ్మివేయు) spat(ఉమ్మివేసెను) spitten(ఉమ్మివేసెను)
Dig(తవ్వుట) dug(తవ్వెను) dug(తవ్వెను)
Abide(కట్టుబడుట) abode(కట్టుబడెను) abode (కట్టుబడెను)
Ride(స్వారీచేయుట) rode(స్వారీచేసెను) ridden(స్వారీచేసెను)
Stride(అంగలువేయుట) strode(అంగలువేసెను) stridden(అంగలువేసెను)
Strive(ప్రయత్నించుట) strove(ప్రయత్నించెను) striven(ప్రయత్నించెను)
Smite (సమ్మెటతో కొట్టు) smote(సమ్మెటతో కొట్టెను) smitten(సమ్మెటతో కొట్టెను)
Weave(నేత నేయడం) wove(నేత నేసెను) woven(నేత నేసెను)
Cleave(చీల్చుట) clove(చీల్చెను) cloven (చీల్చెను)
Shear(గొర్రెల ఊలు కత్తిరించు) shore(కత్తిరించెను) shorn(కత్తిరించెను)
Tread(ప్రత్యేక మార్గంలో నడుచు) trode(నడిచెను) troden(నడిచెను)
Bind(కట్టుకట్టుట) bound(కట్టు కట్టెను) bound(కట్టుకట్టెను)
Wind(చుట్టుట) wound(చుట్టెను) wound (చుట్టెను)
Grind(పిండి విసురుట) ground(పిండి విసిరెను) ground(పిండివిసిరెను)
Cling(అంటిపెట్టుకొనివుండు) clung(అంటిపెట్టుకునెను) clung(అంటిపెట్టుకునెను)
Fling(విసురుట) flung(విసిరెను) flung(విసిరెను)
Spin(ధారము తీయు) spun(ధారము తీసెను) spun(ధారము తీసెను)
Strike(కొట్టు) struck(కొట్టెను) struck(కొట్టెను)
Sting(కుట్టుట) stung(కుట్టెను) stung(కుట్టెను)
Stick(అంటించుట) stuck(అంటించెను) stuck(అంటించెను)
Swing(ఊగుట) swang(ఊగెను) swung(ఊగెను)
Lie(పడుకొనుట) lay(పడుకొనెను) lay(పడుకొనెను)
Shrink(బట్ట తడుపుట) shrank(బట్ట తడిపెను) shrunk(బట్ట తడిపెను)
Spring(గెంతుట) sprang(గెంతెను) sprung(గెంతెను)
Stink(కంపువాసన కొట్టు) stank(కంపువాసన కొట్టెను) stunk(కంపువాసనకొట్టెను)
Bid(వేలంపాట పాడుట) bade(వేలంపాట పాడెను) bidden( వేలంపాట పాడెను)
Ring(గంట కొట్టుట rang(గంట కొట్టెను) rung (గంట కొట్టెను)
Spit(ఉమ్మివేయుట) spat(ఉమ్మివేసెను) spitten(ఉమ్మివేసెను)
Bite(కరచుట) bit(కరిచెను) bitten(కరిచెను)
Hide(దాక్కొను) hid(దాక్కొనెను) hidden(దాక్కొనెను)
Chide(మందలించుట) chid(మందలించెను) chid(మందలించెను)
Glide(జారుట) glid(జారెను) glid(జారెను)
Blow(గాలి కొట్టుట) blew(గాలి కొట్టెను) blown(గాలికొట్టెను)
ఏయే Tenseలో ఎలాంటి Verb form వాడాలి?
TENSE - కాలం
3 Tenses + 5 Verb forms
చాలా మంది గ్రామర్ అంటే బోర్ కొడుతుందంటారు. భయపడుతుంటారు. నేర్చుకోవడం చాలా కష్టంగా ఉంటుందని, గ్రామర్ రూల్స్ కఠినంగా ఉంటాయని టెన్షన్ పడుతుంటారు. ఇంకొందరు తప్పదు కాబట్టి నేర్చుకోవాలని బట్టీ పడుతుంటారు. స్కూల్లో ఇలాంటివే కామనే. కానీ బట్టీ పట్టడం వల్ల ఉపయోగం లేదు. అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుంటే గ్రామర్‌ను చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అదెలాగో చదవండి. ఇందులో ఉన్న వీడియోను కూడా చూడండి.
Click here for video
Example : 11.He works hard.
------
2.He is working hard.
------------
3.He has worked hard.
--------------
4.He worked hard.
--------
5.He will work hard.
------------
Example : 2
1.I write a letter.
------
2.I am writing a letter.
-------------
3.I have written a letter.
---------------
4.I wrote a letter.
------
5.I shall write a letter.
------------
ఈ వాక్యాలను చదవంఢి. వీటిలో తేడా ఎక్కడుంది. Underline చేసిన పదాల్లోనే తేడా ఉంది. Work, write
అనేవి verbs. ఇక్కడ work, write అనేవి రెండు పనులు చేస్తున్నాయి. ఒకటి work అంటే చేసే పనిని తెలుపుతుంది. రెండోది timeని సూచిస్తుంది. ఈ timeని చెప్పడాన్నే మనం Tense అంటాం.
Latin పదం Tempus అంటే Time. అక్కడి నుంచి వచ్చిందే ఇది.
1.He works hard.
--------
2.He worked hard.
--------
3.He will work hard.
------------
ఈ మూడు వాక్యాల్లో తేడా చూడండి. మొదటిది ప్రస్తుత పనిని తెలుపుతోంది. రెండోది జరిగిపోయిన పనిని, మూడోది జరుగబోయే పనిని తెలుపుతుంది. ఇవన్నీ tenseని సూచిస్తున్నాయి. Tense ప్రధానంగా మూడు రకాలు.
1.Present Tense - వర్తమాన కాలం
(A verb that refers to present time is said to be in the Present Tense.)
2.Past Tense - భూత కాలం
(A verb that refers to past time is said to be in the Past Tense.)
3.Future Tense - భవిష్యత్ కాలం
(A verb that refers to future time is said to be in the Future Tense.)
ఇప్పుదు ఈ వాక్యాలను చూడండి.
1.He works hard.-.Present Tense
2.He worked hard. -Past Tense
3.He will work hard. -Future Tense
అలాగే...
1.I write a letter. -Present Tense
2.I wrote a letter. -Past Tense
3.I shall write a letter. -Future Tense
Underline చేసిన పదాలను మరోసారి చదవండి. Work, write అనే క్రియలు ఎలా రూపాంతరం చెందాయో గమనించారు కదా! అంటే జరుగుతున్న పనిని బట్టి ఒక్కో tense 4 భాగాలుగా విడిపోయింది. దీన్నే మనం Aspect అంటాం.
He works hard.
He is working hard.
He has worked hard.
He has been working hard.
ఇవన్నీ కూడా Present Tense. కానీ ఇక్కడ జరుగుతున్న పనితీరును సూచిస్తున్నాయి. అంటే ప్రతి tenseలో కామన్‌గా 4 Aspects ఉంటాయి.
అవి.
1.Simple
2.Continuous
3.Perfect
4.Perfect Continuous
వీటిని మూడు tenseలకు అప్లై చేస్తే ఎలా ఉంటుందో చూడండి.
Present Tense :
1.Simple Present Tense
2.Present Continuous Tense
3.Present Perfect Tense
4.Present Perfect Continuous Tense
Past Tense :
1.Simple Past Tense
2.Past Continuous Tense
3.Past Perfect Tense
4.Past Perfect Continuous Tense
Future Tense :
1.Simple Future Tense
2.Future Continuous Tense
3.Future Perfect Tense
4.Future Perfect Continuous Tense
ఇప్పుడు వీటికి ఉదాహరణలు చూద్దాం.
Present Tense :
1.I write a letter. -Simple Present
2.I am writing a letter. -Present Continuous Tense
3.I have written a letter. -Present Perfect Tense
4.I have been writing a letter. -Present Perfect continuous Tense
Past Tense :
1.I wrote a letter. -Simple Past Tense
2.I was writing a letter. - Past Continuous Tense
3.I had written a letter. -Past Perfect Tense
4.I had been writing a letter. -Past Perfect Continuous Tense
Future Tense :
1.I shall write a letter. -Simple Future Tense
2.I shall be writing a letter. -Future Continuous Tense
3.I shall have written a letter. -Future Perfect Tense
4.I shall have been writing a letter. -Future Perfect Continuous Tense
Tense సరే ఒక వాక్యం ఏ tenseలో ఉందో ఎలా తెలుస్తుంది? క్రియను బట్టే ఆ వాక్యం ఏ tenseలో ఉందో తెలుసుకోవచ్చు.
Ex : works - Simple Present
worked - Simple Past
is writing -Present Continuous
has written -Present Perfect
will work -Simple Future
వీటిని గమనిస్తే ఒకే క్రియ 5 రకాలుగా రూపాంతరం చెందిందని అర్థమవుతుంది.
V1 V2 V3 V4 V5
Present Base verb Present Past Past
verb + s, es participle verb participle
----- ----------- ----------- ------ -----------
work works working worked worked
write writes writing wrote written
go goes going went gone
speak speaks speaking spoke spoken
వీటిని మీరు స్కూల్లో చదువుకున్న తీరు గుర్తుంది కదా!
work worked worked
write wrote written
ఇలాగే బట్టీ పట్టారు కదా! ఇక్కడ చాలా మంది చేసే పొరపాటేంటంటే వీటిని Present tense, Past tense, Future tense అనుకుంటారు. కానీ Future tense main verb అనేది లేదు. Present verbకు ముందు will/shall చేరుస్తాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవల్సిన మరో విషయం ఏంటంటే... Present participle and Past participleను మూడు tenseలలోనూ వాడుతాం.
Present participle Ex.
1.I am going to school.
2.I was going to school.
3.I shall be going to school.
Past participle Ex.
1.I have finished my home work.
2.I had finished my home work, when you came to me yesterday.
3.I will have finished my home work by this time tomorrow.
Tense బాగా అర్థం కావాలంటే verb formsని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. కానీ ఇది అంత ఈజీ కాదు. ఎందుకంటే verbs అనేవి వేల సంఖ్యలో ఉంటాయి. వీలైనన్ని ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. కుదరకపోతే కనీసం మనకు రోజువారీగా ఉపయోగపడేవాటినైనా గుర్తుంచుకోవాలి. చదివేటప్పుడు కొత్తగా అనిపించిన verbs గురించి Dictionary సాయంతో తెలుసుకోవాలి.
=============
0 comments:
Post a Comment